పెదకాపు-1 నా కెరీర్‌లో గర్వంగా చెప్పుకునే సినిమా – ఛోటా కె. నాయుడు

Chota K Naidu Reveals Interesting Facts About Peddha Kapu-1 Movie

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో విరాట్ కర్ణ ప్రధానపాత్రలో సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ‘అఖండ’తో సాలిడ్ బ్లాక్‌బస్టర్‌ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సెప్టెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి డివోపీగా పనిచేసిన స్టార్ సినిమాటోగ్రఫర్ ఛోటా కె. నాయుడు విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలను, తన అనుభవాలను ఆయన తెలియజేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘పెదకాపు-1‘ గురించి ఛోటా కె. నాయుడు మాటల్లో..

  • శ్రీకాంత్ అడ్డాల తొలి చిత్రం ‘కొత్త బంగారులోకం’ చేసినప్పటినుంచి మా జర్నీ మొదలైయింది.
  • తన సినిమాల్లానే శ్రీకాంత్ చాలా కూల్ గా వుంటారు. నాకొక కె విశ్వనాథ్ గారిలా అనిపిస్తారు.
  • అయితే నారప్పతో ఆయనలో ఒక కొత్త ట్రాన్స్ ఫర్మేషన్ వచ్చింది. ఇందులో తను నటన కూడా మొదలుపెట్టారు.
  • శ్రీకాంత్ ఇలాంటి ఒక సినిమా డైరెక్టర్ చేసి ఇలాంటి అవుట్ పుట్ ఇవ్వడం ఒక కెమెరామెన్ గా నాకు షాక్ ఇచ్చింది.
  • పని చేయడం నాకు చాలా ఇష్టం. నేను చాలా ఇష్టపడి పని చేస్తాను.
  • ఈ కథ కొత్త ప్యాట్రన్, కొత్త కలర్స్, మేకింగ్ ని డిమాండ్ చేయడంతో ఇది నాకు సవాల్ గా అనిపించింది.
  • పీసీ శ్రీరామ్ గారితో పోల్చుకునేంటంత గొప్పోడినైతే కాదు. విఎస్ఆర్ స్వామీ గారు, విన్సెంట్ గారు, పీసీ శ్రీరామ్ వీళ్ళంతా గొప్పోళ్ళు.
  • ట్రైలర్ చూసినప్పుడు విజువల్ గా చాలా ఇంపాక్ట్ గా వున్నాయి. ఇలాంటి బెస్ట్ అవుట్ పుట్ రావడంలో క్రెడిట్ దర్శకుడిదే.
  • చిన్నా పెద్ద అని కాదు, హీరో స్థానాన్ని ఎప్పుడూ గౌరవిస్తాను. ఆ కథానాయకుడు ఎలా ఉండాలో కెమరామెన్ గా నాకొక విజన్ వుంటుంది.
  • విరాట్ తో పని చేస్తున్నప్పుడు తను కొత్తవాడు అనే ఫీలింగ్ రాలేదు. అనుభవం వున్న నటుడిలానే చాలా అద్భుతంగా చేశాడు.
  • ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ వుంది. ఆ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు అనసూయ ఐతే బాగుంటుందని అనుకున్నాం.
  • మేము అనుకున్నదాని కంటే అద్భుతంగా చేసింది తను. ఈ పాత్రే కాదు.. దర్శకుడు శ్రీకాంత్ ఇందులో ప్రతి పాత్రని చాలా చక్కగా డిజైన్ చేశాడు.
  • నిజంగా శ్రీకాంత్ నటుడిగా ఆశ్చర్యపరిచాడు. ఎంత కష్టమైన షాట్ ని కూడా సింగల్ టేక్ లో చేసేశాడు.
  • పెదకాపు ఎంత మంచి, గొప్ప సినిమానో.. పెదకాపు 2 కూడా వుందంటే అర్ధం చేసుకోవచ్చు.
  • మీరు ట్రైలర్ లో చూస్తే ఒక అమ్మాయి ఎండిపోయిన చెట్టుకి హ్యాంగ్ చేయబడి కనిపిస్తుంది. సినిమాలో ఆ సన్నివేశం చాలా కీలకంగా వుంటుంది.
  • ఆ సన్నివేశంలో దాదాపు వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్ట్ లు వుంటారు. ఒక రోజు మొత్తం ఆ పాత్ర పోషించిన అమ్మాయి హ్యాంగింగ్ పొజిషన్ లోనే వుంది.
  • నేను కెమరామెన్ ఐతే గోదారిని ఇలా వాడుకోవాలని వుండేది. కొత్తబంగారు లోకంలో గోదారిని ఒక్క స్థాయి వరకే వాడాను. ఈ సినిమాలో పూర్తిగా వాడే ఛాన్స్ దొరికింది.
  • ఈ సినిమాలో మరో పెద్ద ఎలిమెంట్.. వూర్లో జెండాకర్ర పాతడానికి హీరో అండ్ బ్యాచ్ పడే స్ట్రగుల్ చాలా ఆసక్తికరంగా వుంటుంది.
  • దీని కోసం అడవిలో ఓ పెద్ద చెట్టుని నరికి తెచ్చి పాతుతారు. ఈ చెట్టు పాతే ఎపిసోడ్ షూట్ చేయడం నా కెరీర్ లో ఓ అద్భుతం.
  • దీనికి క్రియేటర్ శ్రీకాంత్ ఐతే.. భుజాన మోసింది ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్. నేను చాలా గర్వంగా చెప్పుకునే ఎపిసోడ్ ఇది.
  • మిక్కీ జే మేయర్ ఇలాంటి నేపధ్య సంగీతం ఇవ్వడం నాకు సర్ ప్రైజ్ చేసింది.
  • అలాగే హీరోయిన్ ప్రగతి కూడా టెర్రిఫిక్ గా పెర్ఫార్మ్ చేసింది.
  • చిరంజీవి గారి సినిమా నవంబర్ నుంచి వుంటుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + fourteen =