బ్లాక్ బాస్టర్ గబ్బర్ సింగ్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్.ఇటీవలే ఈసినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో ప్రారంభమైంది.అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయిడు అరెస్ట్ నేపథ్యంలో హుటాహుటిన విజయవాడకు వెళ్లి రెండో రోజుల తరువాత పవన్ తిరిగి నిన్న హైదరాబాద్ కు చేరుకున్నాడు.ప్రస్తుతం పవన్ మళ్ళీ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు.ఈషెడ్యూల్ లో ఫైట్ మాస్టర్ లు రామ్- లక్ష్మణ్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది ఈసినిమా థియేటర్లోకి రానుంది.
ఇక పవన్ ఈసినిమాతోపాటు మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.అందులో ఒకటి ఓజీ.మచ్ అవైటెడ్ మూవీ గా వస్తున్న ఈసినిమాను వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.సుజీత్ డైరెక్ట్ చేస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.ఈసినిమాతో పాటు పవన్,క్రిష్ డైరెక్షన్ లో హరి హర వీరమల్లు లో కూడా నటిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: