పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీయఫ్ ఫేమ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న ‘సలార్’ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి చిత్ర బృందం ప్రకటించిన మేరకు ఈనెల 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వలన చిత్రం విడుదల వాయిదా పడింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా నిరుత్సాహానికి గురయ్యారు. సలార్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితిలో వారు సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా చిత్ర బృందం దీనిపై అధికారికంగా స్పష్టత ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు మూవీ టీమ్ ఎక్స్ (ట్విట్టర్)లో ఒక పోస్ట్ పెట్టింది. అందులో.. “సలార్‌కు మీ తిరుగులేని మద్దతును మేము ఎంతో అభినందిస్తున్నాము. అనుకోని పరిస్థితుల కారణంగా సినిమాను మేము ముందుగా చెప్పినట్లు సెప్టెంబర్ 28 విడుదల చేయలేకపోతున్నాం. అయితే ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నందున, ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనిని అభిమానులు దయచేసి అర్థం చేసుకోండి. మా బృందం అత్యున్నత ప్రమాణాలను అందుకోవడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. త్వరలోనే కొత్త విడుదల తేదీని వెల్లడిస్తాం. మేము ప్రస్తుతం సలార్‌కు తుది మెరుగులు దిద్దుతున్నాం. ఈ సమయంలో మాకు మీ మద్దతునివ్వండి. అలాగే ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైనందుకు ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.
We deeply appreciate your unwavering support for #Salaar. With consideration, we must delay the original September 28 release due to unforeseen circumstances.
Please understand this decision is made with care, as we’re committed to delivering an exceptional cinematic experience.… pic.twitter.com/LPf5N2roh7— Salaar (@SalaarTheSaga) September 13, 2023
ఇక తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతోన్న సలార్ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ కు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. కాగా సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీతో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సలార్ మూవీని తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.