మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. మహిళల కోసం స్పెషల్ మార్నింగ్ షో

Miss Shetty Mr Polishetty: Special Screening For Ladies in AP and Telangana on Sep 14th

అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా రూపొందిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. గత వారం విడుదలైన ఈ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌ తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుని విజయవంతంగా నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో సైతం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మరోవైపు అదేరోజు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ‘జవాన్’ మూవీ విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోన్న వేళ.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా కూడా సత్తా చాటడం గమనార్హం. ప్రజెంట్ జెనరేషన్ యూత్‌కి కనెక్ట్ అయ్యే కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్నిచోట్లా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. అలాగే అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టిల నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే..? ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా స్పెషల్ స్క్రీనింగ్. మహిళల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించడానికి నిశ్చయించుకుంది. ఈ మేరకు మూవీ యూనిట్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం.. ఈ గురువారం (సెప్టెంబర్ 14) రోజున ఉదయం మహిళల కోసం స్పెషల్ మార్నింగ్ షో ప్రదర్శించనుంది. అయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది.

మరోవైపు దీనిపై చిత్ర హీరోయిన్ అనుష్క శెట్టి సైతం ట్విట్టర్ ద్వారా మాట్లాడారు. అందులో.. “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా పట్ల మీరు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే హృదయం ఉప్పొంగుతోంది.. ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మహిళల కోసం ఈ గురువారం ప్రత్యేక మార్నింగ్ షోను ఏర్పాటు చేస్తున్నాము. ఆ రోజున మీ అందరినీ థియేటర్లలో కలుస్తాం” అని పేర్కొన్నారు. సో.. ఈ సినిమాను వీక్షించాలనుకునే మహిళలు ఎవరైనా ఉంటే.. మీకు సమీపంలోని థియేటర్లలో ఈ సినిమా స్పెషల్ మార్నింగ్ షోకి వెళ్లి చూసేయండి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here