టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘ఖుషి’ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో.. 100 పేద కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తానని కొన్నిరోజులక్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. చాలా రోజుల తర్వాత వచ్చిన సినిమా సక్సెస్ ను తాను ఎంతో ఎంజాయ్ చేస్తున్నానని.. అలాగే 100 మంది పేద కుటుంబాలకు సహాయం చేయడం ద్వారా ఈ సంతోషాన్ని వారికి కూడా పంచుతానని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. తన టీమ్ 100 కుటుంబాలను గుర్తించనుందని, త్వరలోనే వారి వివరాలు తెలియజేస్తానని చెప్పాడు. ఈ క్రమంలో ఈరోజు దానికి సంబంధించి విజయ్ దేవరకొండ బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా.. ఆ 100 ఫ్యామిలీస్ లిస్ట్ ఇదే అంటూ వెల్లడించాడు. తాను ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే వారందరికీ ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున అందించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
The 100 familes we picked this time. I hope it brings cheer to your families ❤️🥰#SpreadingKushi#DevaraFamily pic.twitter.com/9Om8E2dJho
— Vijay Deverakonda (@TheDeverakonda) September 14, 2023
కాగా విజయ్ దేవరకొండ, సమంత క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఖుషి’ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెస్టెంబర్ 1న గ్రాండ్‌గా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ క్రమంలో తమిళనాడులో ఈ యేడాది అత్యధిక గ్రాస్ సాధించిన టాలీవుడ్ సినిమాగా ఖుషి రికార్డ్ సృష్టించింది. హేషమ్ అబ్దుల్ వాహద్ అందించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
దీనికితోడు విజయ్, సమంత జోడి మధ్య కెమిస్ట్రీ బావుందని అన్ని వర్గాల ఆడియెన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో సినిమా మంచి విజయం సాధించింది. ఇక రీసెంట్‌గా ఈ సినిమా రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 6 నుంచి ఖుషి సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ఈ సినిమాను నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: