అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత మాస్ మేకర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా వస్తున్న సినిమా స్కంద. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టైటిల్ గ్లింప్స్, టీజర్, పాటలు అన్నింటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నిజానికి సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ అవ్వాలి కానీ.. ఇంకా పనులు పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. ఫైనల్ గా సెప్టెంబర్ 28వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈసినిమా నుండి వరుస అప్ డేట్లు ఇస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. రీసెంట్ గానే ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం.
ఇక ఈసినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో మరోసారి అర్థమవుతుంది. దానికి కారణం బుక్ మై షో లో ఈసినిమాకు వస్తున్న ఇంట్రెస్ట్సే కారణం. ఈ సినిమాకు బుక్ మై షో లో 100 కే ప్లస్ ఇంట్రెస్ట్స్ రావడం విశేషం. మరి ఒకసారి టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయిన తరువాత ఈసినిమా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోవడం ఖాయం అని చెప్పొచ్చు.
The excitement and anticipation for the arrival of #Skanda is sky-high💥
Massive 100K+ Interests on @bookmyshow ❤️🔥#SkandaOnSep28 in Telugu, Hindi, Tamil, Malayalam & Kannada!❤️#RAPOMass
Ustaad @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @saieemmanjrekar @MusicThaman… pic.twitter.com/GLNeNWBooE
— BA Raju’s Team (@baraju_SuperHit) September 12, 2023
కాగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయబోతున్నారు
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: