కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 288

gam gam ganesha movie teaser released
ట్రైలర్ & టీజర్

గం గం గణేశా టీజర్ రిలీజ్

ఉదయ్ శెట్టి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా గం గం గణేశా. ఇప్పటివరకూ లవర్ బాయ్ గా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లతో అలరించిన ఆనంద్ దేవరకొండ ఇప్పుడు యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. అయితే ఈసినిమా కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ లాగ అనిపిస్తుంది. ఇక ఈసినిమా ఎంత సైలెంట్ గా షూటింగ్ ను పూర్తిచేసుకుందో అంతే ఫాస్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా జోరుగా చేస్తుంది. దీనిలో భాగంగానే వరుస అప్ డేట్లను ఇస్తున్నారు మేకర్స్. ఈసినిమా ఫస్ట్ లుక్ ను అలానే మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారో లేదో అప్పుడే టీజర్ అప్ డేట్ తో వచ్చేశారు.

TFN Adminవాట్సాప్
mark antony movie talk
సినిమా వార్తలు

మార్క్ అంటోనీ మూవీ టాక్

విశాల్,ఎస్ జె సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మార్క్ అంటోనీ.ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన ట్రైలర్,ఈసినిమా ఫై ఆసక్తిని తీసుకొచ్చింది.ముఖ్యంగా ట్రైలర్ లో ఎస్ జె సూర్య డైలాగ్స్ సినిమాపై హైప్ ను క్రీయేట్ చేశాయి.ఇక ఈసినిమా ఈరోజే థియేటర్లోకి వచ్చింది.ఈసినిమాకు రివ్యూస్ పాజిటివ్ గా వస్తుండడమే కాదు మౌత్ టాక్ కూడా అలాగే వుంది.దాంతో కోలీవుడ్ లో ఈసినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకునేలా వుంది.తమిళంతోపాటు తెలుగులోకూడా విడుదలకాగా తెలుగులో డీసెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోనుంది.

Mahender Reddyవాట్సాప్
devil movie first single Maaye Chesey song promo out
సాంగ్

డెవిల్ ఫస్ట్ సింగిల్ మాయే చేసే సాంగ్ ప్రోమో రిలీజ్

కళ్యాణ్ రామ్ నుండి రాబోతున్నమోస్ట్ అవైటెడ్ సినిమా డెవిల్. 1940 బ్రిటిష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ లో స్పై థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ స్పై పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. కాన్సెప్ట్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్. అంతేకాదు ఇప్పటి వరకూ ఈసినిమా నుండి కేవలం గ్లింప్స్ మాత్రమే రిలీజ్ చేయగా గ్లింప్సే సినిమాకు కావాల్సినంత బజ్ ను క్రియేట్ చేసింది.

TFN Adminవాట్సాప్
samayama song promo out from hi nanna movie
సాంగ్

హాయ్ నాన్న-సమయమా సాంగ్ ప్రోమో రిలీజ్

శౌర్యువ్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. తల్లీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్, గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేశాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Rakshit Shetty's Saptha Sagaralu Dhaati Movie Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

రక్షిత్ శెట్టి 'సప్త సాగరాలు దాటి' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

ప్రముఖ కన్నడ హీరో రక్షిత్ శెట్టి పేరు చెప్తే తెలుగు ప్రేక్షకులు ఠక్కున గుర్తుపట్టకపోవచ్చు. అయితే ‘777చార్లీ’ సినిమా హీరో అంటే మాత్రం వెంటనే గుర్తుపడతారు. ఆ సినిమాతో తెలుగులో ఓవర్‌నైట్‌ పాపులర్ అయ్యాడు రక్షిత్‌ శెట్టి. అంతకుముందు ‘అతడే శ్రీమన్నారాయణ’ అనే పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన కన్నడ చిత్రం 'సప్త సాగరదాచే ఎల్లో: సైడ్‌-ఏ' సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో రక్షిత్‌ సరసన రుక్మిణి వసంత్ కథానాయికగా నటించారు. చరణ్ రాజ్ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయింది. లవ్ స్టోరీ నేపథ్యం కలిగి ఉండటంతో యూత్ ఎక్కువగా కనెక్ట్…

Srikanth Mవాట్సాప్
mega star bhola shankar movie streaming now in ott
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన భోళాశంకర్

మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా భోళాశంకర్. తమిళ్ లో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్నసంగతి తెలిసిందే కదా. ఆగష్ట్ 11వవ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా ఇక్కడ మాత్రం ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. దీనిలో భాగంగానే నేడు ఈసినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆడియన్స్ ముందుకి…

TFN Adminవాట్సాప్
Skanda Will Be Releasing in Over 350 Locations Across USA
సినిమా వార్తలు

స్కంద యూఎస్‌లో ఎన్ని లొకేషన్లలో రిలీజ్ అవుతుందంటే?

టాలీవుడ్‌లో మాస్ మసాలా యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌ డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఆయన తన సినిమాలలో హీరోలను ఊర మాస్ క్యారెక్టర్స్ లో చూపిస్తుంటారు. అలాగే ఎనర్జిటిక్ క్యారక్టర్లకు పెట్టింది పేరు రామ్‌ పోతినేని. వీరిద్దరి కలయికలో వస్తోన్న చిత్రం 'స్కంద'. ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. సయీ మంజ్రేకర్‌ మరో కీలక పాత్ర పోషిస్తోంది. అఖండ సినిమాతో అద్భుత విజయం అందుకున్న బోయపాటి శ్రీను తర్వాత వస్తోన్న చిత్రం కావడం, అలాగే స్కంద నుంచి లాంఛ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్‌, సాంగ్స్ కు విశేష స్పందన రావడంతో ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్…

Srikanth Mవాట్సాప్
SIIMA Awards 2023: Rana, Sreeleela and Other Stars Attends at Press Meet in Dubai
సినిమా వార్తలు

దుబాయ్‌లో సైమా అవార్డ్స్‌ వేడుకలు.. సినీ తారల సందడి

సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సైమా అవార్డ్స్‌ (సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్‌) 2023 వేడుకలకు సర్వం సిద్ధం అయింది. దుబాయ్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ వేదికగా ఈరోజు, రేపు (సెప్టెంబర్ 15, 16) ఈ అవార్డుల కార్యక్రమం జరుగనుంది. ఇక ఈవెంట్‌లో భాగంగా దుబాయ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేయగా.. అందులో పలువురు తారలు పాల్గొని సందడి చేశారు. వీరిలో టాలీవుడ్ యాక్టర్లు రానా, ప్రణీత, శ్రీలీల, మంచు లక్ష్మీప్రసన్న మరియు తమిళ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాశ్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట ట్రెండింగ్‌ అవుతున్నాయి. మరోవైపు సైమా…

Srikanth Mవాట్సాప్
anand deverakonda gam gam ganesha movie teaser release date locked
ట్రైలర్ & టీజర్

గం గం గణేశా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

రీసెంట్ గా బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఇక అలా వచ్చిందో లేదో అప్పుడే మరోసినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా గం గం గణేశా. ఈసినిమా షూట్ ను చాలా సైలెంట్ గా మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక మరోవైపు ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఈసారి విజయ్ డిఫరెంట్ కథతో రాబోతున్నట్టు అర్థమవుతుంది. ఇప్పుడు మరో సర్ ప్రైజిగ్ అప్ డేట్ తో వచ్చేశాడు. టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా…

TFN Adminవాట్సాప్
I have seen Pushpa three times in three days says Srk
సినిమా వార్తలు

పుష్ప మూడు సార్లు చూశాను- షారుఖ్ ఖాన్

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వరుస ప్లాఫుల తరువాత ఈఏడాది ప్రారంభంలో పఠాన్ తో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు.ఈసినిమా 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది.ఇక పఠాన్ తరువాత గత వారం జవాన్ తో వచ్చి ఫామ్ కొనసాగించడమే కాదు షారుఖ్ తన రికార్డులను తానే బ్రేక్ చేసుకుంటున్నాడు.వారం రోజుల్లో జవాన్ ప్రపంచ వ్యాప్తంగా 660కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.వర్కింగ్ డేస్ లోకూడా స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
kalyan ram devil movie first single release date fixed
రిలీజ్ అప్‌డేట్

డెవిల్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈమధ్య తన రూట్ ను మార్చి విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా డెవిల్. పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ స్పై పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈసినిమా ఎంత సైలెంట్ మొదలుపెట్టారో అంతే సైలెంట్ గా కంప్లీట్ చేశారు. అయితే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో ఒక్కసారిగా సినిమాపై క్రేజ్ పెరిగింది. ఇక రీసెంట్ గానే ఈసినిమా డబ్బింగ్ పనులను పూజా కార్యక్రమాలతో ప్రారంభించి ప్రస్తుతం ఆదిశగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నారు మేకర్స్. రీసెంట్ గానే సంయుక్త మీనన్ పుట్టిన రోజు…

TFN Adminవాట్సాప్
jawan movie first week collections update
బాక్సాఫీస్

జవాన్ షాకింగ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ మరోసారి తాను బాలీవుడ్ బాద్ షా అని నిరూపించాడు. లాక్ డౌన్ తరువాత పూర్తిగా ఢీలా పడిపోయిన బాలీవుడ్ ఇండస్ట్రీకి పఠాన్ అంటూ వచ్చి ప్రాణం పోశాడు. ఆ తరువాత పరిస్థితి కొంత మెరుగుపడింది. ఇక ఇప్పుడు మరోసారి జవాన్ అంటూ వచ్చి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపించాడు. అట్లీ దర్శకత్వంలో పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన సినిమా జవాన్. వీరిద్దరి కాంబినేషన్ పై మొదటి నుండీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అంచనాలకు ఎక్కడా తగ్గకుండా సినిమా ఉండటంతో ఫస్ట్ షో నుండే హిట్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.

TFN Adminవాట్సాప్
naga chaitanya became the owner of hyderabad blackbirds motorsport team
సినిమా వార్తలు

మోట‌ర్ స్పోర్ట్ రేసింగ్ టీమ్ ఓన‌ర్‌గా నాగ‌చైత‌న్య

హీరోలు తమ వృత్తి రీత్యా సినిమాలు చేస్తుంటారు. సినిమాలు అంటే ఇష్టం, ప్యాషన్ ఉండి కొంతమంది హీరోలుగా మారుతుంటారు.. కొంతమంది వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటారు. అయితే సినిమాల సంగతి పక్కన పెడితే వారికి కూడా పర్సనల్ లైఫ్ లో కొన్ని ఇష్టాలుంటాయి. ఈనేపథ్యంలోనే నాగచైతన్యకు బైక్స్ ఇంకా రేస్ లంటే ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఇప్పుడు స్పోర్ట్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మోట‌ర్ రేసింగ్ టీమ్‌కు ఓన‌ర్‌గా మారాడు నాగ చైతన్య.

TFN Adminవాట్సాప్
Jr NTR Left For Dubai With Family For Attending SIIMA Awards 2023 Event
సినిమా వార్తలు

దుబాయ్‌కి పయనమైన జూ. ఎన్టీఆర్.. దేనికోసమంటే?

టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌ తాజాగా నటిస్తున్న 'దేవ‌ర' సినిమా షూటింగ్‌కు స్మాల్ బ్రేక్ ఇచ్చారు. తన కుటుంబంతో కలిసి ఆయన విదేశీ పర్యటనకు బయలుదేరారు. కాగా ఆయన దుబాయ్ పర్యటనకు వెళ్తున్నట్లు తెలిసింది. సైమా అవార్డ్స్ ఈవెంట్‌కి హాజరయ్యేందుకు జూనియర్ దుబాయ్‌కి బయలుదేరినట్లు సమాచారం. ఈ క్రమంలో గురువారం ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జూ. ఎన్టీఆర్ ఇలా సడన్‌గా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లడం ఫ్యాన్స్ కి కొంత ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే తారక్ దుబాయ్ వెళ్ళడానికి బలమైన కారణమే ఉంది…

Srikanth Mవాట్సాప్
Proud Se Single full song released from mad movie
సాంగ్

మ్యాడ్ ప్రౌడ్ సే సింగిల్ ఫుల్ సాంగ్ రిలీజ్

ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే కదా. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె నితిన్ హీరోగా వస్తున్న సినిమా మ్యాడ్. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతున్నట్టు ఇప్పటికే వచ్చిన అప్ డేట్లను బట్టి అర్థమైపోయింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది ఈసినిమా.

TFN Adminవాట్సాప్
costliest camera used for ntrs devara movie
సినిమా వార్తలు

దేవర కోసం ప్రపంచంలోనే ఖరీదైన కెమెరా

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా దేవర. జనతా గ్యారేజ్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా షూటింగ్ ఇటీవలే మొదలుపెట్టి పూర్తి చేస్తున్నారు. ఆమధ్య సినిమాటో గ్రాఫర్ రత్నవేలు కూడా ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉండేవారు. అయితే ఈమధ్య కాస్త సైలెంట్ అయింది చిత్రయూనిట్. అయితే సైలెంట్ గా తమ షూటింగ్ ను పూర్తి చేస్తున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
allu arjun responds on jawan movie
సినిమా వార్తలు

జవాన్ గురించి స్పందించిన అల్లు అర్జున్

షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.విడుదలైన 6 రోజుల్లోనే 620 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది.ఫుల్ రన్ లో ఈసినిమా 1000కోట్ల మైలురాయిని చేరుకోనుంది.దాంతో షారుఖ్,పఠాన్ తరువాత ఈ ఫీట్ సాదించడం రెండో సారి కానుంది.ఇక ఇదిలావుంటే ఈసినిమా చూసి ట్వీట్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

Mahender Reddyవాట్సాప్
hi nanna first single samayama song release date fixed
సాంగ్

హాయ్ నాన్న ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

న్యాచురల్ స్టార్ నాని నుండి రాబోతున్న సినిమా హాయ్ నాన్న. దసరా లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక దసరా సినిమాలో ఊర మాస్ పాత్రలో కనిపించగా ఇప్పుడు సాఫ్ట్ పాత్రతో వస్తున్నాడు. అంతేకాదు ఈసారి తండ్రి పాత్రలో అలరించనున్నాడు. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే ఫస్ట్ లుక్స్ ను అలాగే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Muttiah Muralitharan's Biopic 800 Movie Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

మురళీధరన్ బయోపిక్ 800 రిలీజ్ డేట్ ఫిక్స్

టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘800’. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. కాగా ‘800’ ఆలిండియా పంపిణీ హక్కులను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నారు.

Srikanth Mవాట్సాప్
kushi movie usa collections update
బాక్సాఫీస్

ఖుషి దూసుకుపోతున్న యూఎస్ఏ కలెక్షన్స్

శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రల్లో వచ్చిన సినిమా ఖుషి. సెప్టెంబ‌ర్ 1న రిలీజైన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫ్యామీలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో సమంత, విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ ఇంకా లవ్, కామెడీ యాంగిల్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను అందించింది. ఈ సినిమా ఇప్పటికే తమిళ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే 2023 లో తమిళనాడులో రిలీజ్ అయి అత్యధిక కలెక్షన్ సొంతం చేసుకున్న తెలుగు మూవీగా ఖుషి నిలిచింది.

TFN Adminవాట్సాప్

షేర్