బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ అప్పటినుండి పాన్ ఇండియా సినిమాలనే చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా ఆది పురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది సలార్ సినిమా కోసం. ఈసినిమా సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ కావాల్సింది కానీ ఇంకా పనులు పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ డేట్ వాయిదా పడింది. ప్రస్తుతం అయితే నాగ్ అశ్విన్ తో కల్కీ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు ప్రభాస్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా వీటితో పాటు ప్రభాస్ స్పిరిట్ సినిమా చేస్తున్న సంగతి కూడా విదితమే. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే టైటిల్ తో ఈసినిమా రూపొందుతుంది. ఇంకా సలార్ సినిమానే రిలీజ్ కాలేదు ఈసినిమా ఎప్పుడు మొదలవుతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈసినిమా విషయంలో క్లారిటీ ఇచ్చారు నిర్మాత భూషణ్ కుమార్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భూషణ్ కుమార్.. ప్రస్తుతం యానిమల్ సినిమాపై ఫోకస్ పెడుతున్నాము.. ఈసినిమా రిలీజ్ తరువాత ఒక 5 లేదా 6 నెలల గ్యాప్ తీసుకొని ఆ తరువాత స్పిరిట్ సినిమాను స్టార్ట్ చేయనున్నాము అని తెలిపారు. ఈనేపథ్యంలో 2024 జూన్ నుండి షూటింగ్ ను మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బేసిక్ వర్క్ ఇప్పటికే మొదలవ్వగా యానిమల్ తరువాతే ఫుల్ వర్క్ స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం.
కాగా ఈసినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాప్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చే సినిమానే అయినా సందీప్ తన మార్క్ మేకింగ్ ను చూపిస్తాడని అంటున్నారు. ఇక ఈసినిమాను టీ సిరీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో భూషణ్ కుమార్ నిర్మించనున్నాడు. ఈ సినిమాను ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.