
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 290


యూకే లో లియో హవా- రికార్డ్ బుకింగ్స్

సూపర్ స్టార్ కి ఎలాగైనా సూపర్ హిట్ ఇస్తా

రూల్స్ రంజన్ విడుదల వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే?

మ్యాడ్ మూవీ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

పెదకాపు1 ‘అఖండ’ లాంటి విజయం సాధించాలి

జిగర్ తండ డబుల్ ఎక్స్ టీజర్ రిలీజ్

ఛాంగురే బంగారురాజా ట్రైలర్ రిలీజ్

జవాన్ 4రోజుల్లో 500కోట్లు

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చాలా ఎంజాయ్ చేశా

పుష్ప2 బిగ్ అనౌన్స్ మెంట్- రిలీజ్ డేట్ ఫిక్స్

సరికొత్త రికార్డు సృష్టించిన పుష్ప 2

డబుల్ ఇస్మార్ట్.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

కన్నప్పలో ప్రభాస్.. హింట్ ఇచ్చిన మంచు విష్ణు

స్వయంభూ నుండి సంయుక్త ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్
భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా స్వయంభూ. రీసెంట్ గాన ఈసినిమాను ప్రారంభించారు చిత్రయూనిట్. హై బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈసినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. షూటింగ్ లో భాగంగానే నిఖిల్ రీసెంట్ గా వియాత్నం వెళ్లాడు. అక్కడే మూడు నెలలపాటు ఉండి ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ వంటి వాటిలో ట్రైనింగ్ తీసుకోనున్నాడు. అద్భుతమైన వార్ సీక్వెన్సులు ఉండే ఈ సినిమాలో నిఖిల్ ఎక్స్ టార్డినరీ స్టంట్స్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.

యూకే లో లియో హవా- రికార్డ్ బుకింగ్స్
ఇళయ దళపతి విజయ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చిన విజయ్ ఆసినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా లియో. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

సూపర్ స్టార్ కి ఎలాగైనా సూపర్ హిట్ ఇస్తా
ఒకప్పుడు డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఎస్ జే సూర్య. ఇక ఈమధ్య కాలంలో డైరెక్టర్ గా కంటే కూడా నటనపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. ప్రస్తుతం ఎస్ జే సూర్య పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో మార్క్ ఆంటోని సినిమా కూడా ఒకటి. విశాల్ హీరోగా వస్తున్నఈ సినిమాలో సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.

మార్క్ ఆంటోనీకి తొలిగిన అడ్డంకి.. విడుదలకు సిద్ధం
కోలీవుడ్ హీరో విశాల్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'మార్క్ ఆంటోనీ'. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విశాల్‌తో పాటు ప్రముఖ దర్శక, నటుడు SJ సూర్య మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో విశాల్ సరసన 'పెళ్లిచూపులు' ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ గా చేస్తుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. కాగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా విడుదలకి సంబంధించి ఏర్పడిన అడ్డంకులు తొలిగిపోయాయి.

రూల్స్ రంజన్ విడుదల వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ ప్రస్తుత జెనరేషన్ హీరోలలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ఆయన, సినిమా ఫలితం ఎలా ఉన్నా తను మంచి నటుడు అని అనిపించుకున్నారు. దీంతో బడా నిర్మాతలు సైతం తమ బ్యానర్లపై కిరణ్ తో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్న 'రూల్స్ రంజన్' అనే చిత్రంలో కిరణ్ అబ్బవరం నటిస్తున్న సంగతి తెలిసిందే. రింకు కుక్రెజ సహ నిర్మాతగా…

మ్యాడ్ మూవీ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
టాలీవుడ్ అగ్రహీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటిస్తోన్న మూవీ 'మ్యాడ్'. త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయిసౌజన్య సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఈ మూవీని నిర్మిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమా ద్వారా రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె, నిర్మాత నాగవంశీ సోదరి హారిక సూర్యదేవర నిర్మాతగా అరంగేట్రం చేస్తోంది. ఇంజినీరింగ్ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా మ్యాడ్ సినిమాలో నార్నే నితిన్‌తో పాటు సంగీత్ శోభన్, రామ్ నితిన్ కూడా హీరోలుగా నటిస్తోన్నారు. అలాగే శ్రీ గౌరి ప్రియారెడ్డి, అనంతిక…

పెదకాపు1 ‘అఖండ’ లాంటి విజయం సాధించాలి
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా వస్తున్న సినిమా పెదకాపు1. ఈసినిమా సెప్టెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. దీనిలోభాగంగానే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్, నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ట్రైలర్ లాంచ్ చేయగా, మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు.

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ లాంటి సినిమాలను అందరూ ఎంకరేజ్ చేయాలి
పి మహేష్ బాబు దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి. అనుష్క జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. అందుకే విమర్శకుల ప్రశంసలతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు కూడా అందుకుంటుంది. ఇక ఇప్పుడు తాజాగా మరో టాప్ ప్రొడ్యూసర్ కూడా చేరిపోయారు. తాజాగా హైదరాబాద్ లోని యూవీ క్రియేషన్స్ ఆఫీస్ లో జరిగిన ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు కూడా పాల్గొని ఈసినిమాపై ప్రశంసలు కురిపించారు.

బ్లాక్ బాస్టర్ దిశగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.గత వారం విడుదలైన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తోపాటు మంచి మౌత్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక మొదటి రోజు ఈసినిమా పర్వాలేదని వసూళ్లను సొంతం చేసుకోగా రెండో రోజు నుండి అనుహ్యంగా పుంజుకొని సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.4రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 25కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకొంది. ఈరోజు తో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయనుంది.మరో రెండు వారాల వరకు పెద్ద సినిమాల విడుదలలేకపోవడంతో ఫుల్ రన్ లో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మంచి లాభాలను తీసుకురానుంది.

జిగర్ తండ డబుల్ ఎక్స్ టీజర్ రిలీజ్
తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన జిగర్ తండ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే కదా. ఈసినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తున్న సంగతి కూడా విదితమే. జిగర్ తండా డబుల్ ఎక్స్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. మరోవైపు చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

ఛాంగురే బంగారురాజా ట్రైలర్ రిలీజ్
సతీష్ వర్మ దర్శకత్వంలో కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రత్నం, ఖుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఛాంగురే బంగారురాజా. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. సెప్టెంబర్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మాస్ మహారాజా ఈసినిమా ట్రైలర్ ను తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయడం జరిగింది.

జవాన్ 4రోజుల్లో 500కోట్లు
షారుఖ్ ఖాన్ జవాన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.వరుసగా నాలుగో రోజు కూడా 100కోట్లకు పైగా రాబట్టి బాలీవుడ్ లో కొత్త రికార్డు ను క్రీయేట్ చేసింది.మూడు రోజు హిందీ సినిమా చరిత్రలోనే అత్యధికంగా 144.22కోట్లు రాబట్టిన ఈసినిమా ఆదివారం మరో 136.17 కోట్ల గ్రాస్ ను ఖాతాలో వేసుకుంది. దాంతో నాలుగు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 520.79కోట్ల గ్రాస్ వసూళ్లతో సెన్సేషన్ సృష్టించింది.అంతేకాదు అతి తక్కువ రోజుల్లో 500కోట్ల క్లబ్ లో చేరిన మొదటి హిందీ సినిమాగా జవాన్ రికార్డు సృష్టించింది.ఇందులో షేర్ 252కోట్లు.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చాలా ఎంజాయ్ చేశా
ఏదైనా సినిమా నచ్చితే దానిపై స్పందించడానికి ఏమాత్రం వెనుకాడరు సూపర్ స్టార్ మహేష్ బాబు. తమ ట్విట్టర్ ద్వారా నచ్చిన సినిమాలను ప్రశంసిస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు మరో సినిమా మహేష్ ప్రశంసలను అందుకుంది. పి. మహేష్ బాబు దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క హీరోయిన్ గా వచ్చిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చి ఈసినిమాలో అనుష్క, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ బాగా నచ్చింది. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా డీసెంట్…

పుష్ప2 బిగ్ అనౌన్స్ మెంట్- రిలీజ్ డేట్ ఫిక్స్
సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న పుష్ప2 సినిమా కూాడా ఒకటి. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమాలో బన్నీ మాస్ లుక్, తన నటన తో పాట కథ, పాటలు అన్నీ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. ఇక ఈసినిమా ఇక్కడ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనాలు సృష్టించడంతో నార్త్ లో కూడా అల్లు అర్జున్ ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అందుకే దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అందరూ ఈసినిమాకోసం ఎదురుచూస్తున్నారు.

సరికొత్త రికార్డు సృష్టించిన పుష్ప 2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని జాతీయస్థాయిలో నిలబెట్టిన చిత్రం 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పుష్పరాజ్ గా ఆయన చూపిన అద్భుత నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకున్నాడు. తాజాగా ఆయన పుష్ప 2: ది రూల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పుష్పకి సీక్వెల్ గా వస్తోన్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రం ఒక సరికొత్త రికార్డ్ సృష్టించింది. బుక్ మై షోలో వేగంగా 100K ఇంటరెస్ట్ రేట్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ మేరకు హీరో అల్లు అర్జున్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకా…

భోళాశంకర్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్
ఈఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో వచ్చి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి.ఈసినిమా 200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.ఇక ఈసినిమా తరువాత గత నెలలో భోళా శంకర్ తో చిరు మరోసారి ప్రేక్షకులను పలకరించాడు.ఇక ఈసినిమా ఇప్పుడు ఓటిటిలోకి రానుంది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను ఈనెల 15నుంచి తెలుగుతోపాటు హిందీ,తమిళ,మలయాళ,కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.

డబుల్ ఇస్మార్ట్.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో 2019లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. మరోసారి వీరిద్దరి కలయికలో దీనికి కొనసాగింపుగా రూపొందుతున్న క్రేజీ ఇండియన్ ప్రాజెక్ట్ 'డబుల్ ఇస్మార్ట్'. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నట్లు, దీనిలో భాగంగా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు చిత్ర బృందం పూరి కనెక్ట్స్ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. ఇక ఈ షెడ్యూల్లో హీరో రామ్ పోతినేని…

కన్నప్పలో ప్రభాస్.. హింట్ ఇచ్చిన మంచు విష్ణు
టాలీవుడ్ నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’. ‘కన్నప్ప’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో చాలా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని హీరో మంచు విష్ణు ఇదివరకే ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ వెల్లడయింది.

1 మిలియన్ క్లబ్ లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
మొత్తానికి లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా మరోసారి తన నటనతో ఆకట్టుకుంది అనుష్క. నిశ్శబ్దం తరువాత అనుష్క నుండి ఎలాంటి సినిమా రాలేదు. చాలా గ్యాప్ తరువాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో వచ్చింది. ఇక ఈసినిమాలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడని ప్రకటించిన దగ్గరనుండే ఈక్రేజీ కాంబినేషన్ పై అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. ఇక ఈసినిమా సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక మొదటి షో నుండే ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో అనుష్క ఇంకా నవీన్ పోలిశెట్టీల నటన, వారి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు అలానే ఎమోషనల్ సీన్స్ కూడా…

ఆర్ఆర్ఆర్ పై బ్రెజిల్ అధ్యక్షుడి ప్రశంసలు, స్పందించిన రాజమౌళి
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పింది. గతేడాది రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఇక ఇందులో కథానాయకులుగా నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్‌లు దీని తర్వాత గ్లోబల్ స్టార్స్‌గా అవతరించారు. ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించిన తీరుకి హాలీవుడ్ దిగ్గజాలు సైతం ఫిదా అయ్యారు. ఇప్పటికే అనేక దేశాలకు చెందిన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రం.. తాజాగా తన ఫ్యాన్స్ లిస్టులోకి మరో ప్రముఖుడిని చేర్చింది.