మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేసేస్తున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. ఆపరేషన్ వేలంటైన్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా డబ్బింగ్ పనులు మొదలుపెట్టినట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#OperationValentine DUBBING mission begins✈️🎙
Team Begins the Dubbing Formalities with Pooja❤️🔥
On 8th December 2023,
Hear the roar of India as it echoes across the skies🇮🇳@IAmVarunTej @ShaktipsHada89 @ManushiChhillar @sidhu_mudda @nandu_abbineni @sonypicsfilmsin… pic.twitter.com/VjSdcsxY9f— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) September 13, 2023
కాగా ఈసినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈసినిమాను డిసెంబర్ 8వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: