ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సెట్స్‌లో పవన్ కళ్యాణ్.. కొత్త షెడ్యూల్ స్టార్ట్

Pawan Kalyan Resumes Back on Sets For Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ క్రేజీ కాంబోలో రూపొందుతున్న మోస్ట్ అవెయిటెడ్‌ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్‌ హౌజ్‌ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్ అభిమానులకు కావాల్సిన అన్ని మాస్ ఎలిమెంట్స్‌ ఉంటాయని గ్లింప్స్‌తోనే క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ హరీష్ శంకర్. భగత్‌.. భగత్‌ సింగ్‌.. మహంకాళి పోలీస్‌ స్టేషన్‌, పత్తర్‌ గంజ్‌, ఓల్డ్‌ సిటీ. ఈ సారి పర్ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ గ్లింప్స్‌ వీడియోలో తనదైన మ్యానరిజంతో పవన్‌ కల్యాణ్ చెప్పిన డైలాగ్స్‌ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంటెరెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఇలా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందో లేదో.. అలా వెనువెంటనే ఎడిటింగ్ పనులు కూడా మొదలుపెట్టేశారు. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. రాజకీయ కార్యక్రమాలు, ఇతర సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. చిన్న బ్రేక్ అనంతరం మళ్లీ ఈ మూవీ సెట్స్‌లోకి అడుగుపెట్టాడు. పోలీస్ డ్రెస్ లో చాలా స్టైలిష్ లుక్ లో పవన్ కనిపించగా.. సెట్స్‌లో పవన్ కు హరీష్ శంకర్ సీన్ వివరిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాగా ఇకపై ఉస్తాద్ భగత్ సింగ్ నయా షెడ్యూల్‌ నాన్‌స్టాప్‌గా జరగనుంది. ఇక పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఇంతకుముందు చేసిన గబ్బర్‌ సింగ్ బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో.. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

కాగా ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. ఆనంద్ సాయి ఆర్ట్ వర్క్ చేస్తున్నాడు. అలాగే అశుతోష్ రాణా, నాగ మహేష్, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సీనియర్ నటి గౌతమి కూడా నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మూవీ యూనిట్ దీనిని ధృవీకరించాల్సి ఉంది. అయితే గబ్బర్‌సింగ్ రూపంలో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పవన్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పటికే వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో మూవీలతో హ్యాట్రిక్ కొట్టిన పవర్ స్టార్.. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సహా సుజిత్‌ దర్శకత్వంలో ఓజీ, క్రిష్‌ జాగర్ల మూడి డైరెక్షన్‌లో హరిహర వీరమల్లు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే వీటితో పాటుగా స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డితో కూడా ఓ సినిమా కమిట్ అయిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి అప్డేట్స్‌ వెల్లడించనున్నారు మేకర్స్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + fourteen =