ఈ ఏడాది దసరా సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. ఈసినిమాలో నాని తండ్రి పాత్రలో నటించబోతున్నాడు. ఈసినిమా షూటింగ్ ను చిత్రయూనిట్ ఎప్పుడో మొదలుపెట్టారు కూడా. చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం మిగిలిన భాగాన్ని పూర్తి చేసుకునే పనిలో పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి చాలా రోజులే అయిపోయింది. దీంతో మంచి అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు తాజాగా మేకర్స్ సర్ ప్రైజింగ్ అప్ డేట్ తో వచ్చేశారు. ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను షురూ చేసేశారు. దీనిలో భాగంగానే తాజాగా చిత్రయూనిట్ దీనికి సంబంధించిన అప్ డేట్ ఇచ్చింది. హాయ్ నాన్న మ్యూజికల్ గాలా మొదలు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో నాని ఇచ్చిన సడెన్ సర్ ప్రైజ్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ లో ఉన్నారు.
𝐇𝐢 👋
The time has come to TURN UP the MUSICAL HEAT 🔥#HiNanna Musical Gala begins❤️🔥Are you ready? 😉
Natural🌟 @NameIsNani @Mrunal0801 @shouryuv @HeshamAWMusic @SJVarughese @mohan8998 @drteegala9 @kotiparuchuri @VyraEnts@TSeries @TseriesSouth pic.twitter.com/NGuLnFLSEB
— Vyra Entertainments (@VyraEnts) September 13, 2023
ఇక ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా..హృదయం ఫేమ్‌కు చెందిన ప్రముఖ మలయాళ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.వి.మోహన్, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈసినిమాను డిసెంబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: