పి. మహేష్ బాబు దర్శకత్వంలో అనుష్క, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఇక ఈసినిమా సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక మొదటి షో నుండే ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో అనుష్క ఇంకా నవీన్ పోలిశెట్టీల నటన, వారి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు అలానే ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈసినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. అంతేకాదు ఈసినిమాపై పలువురు సెలబ్రిటీలు సైతం తమ సోషల్ మీడియా ద్వారా స్పందించి అభినందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా గురించి యంగ్ హీరోలు నిఖిల్ ఇంకా నవీన్ పోలిశెట్టి మధ్య జరిగిన సంభాషణ వైరల్ గా మారింది. ఈసినిమా గురించి నిఖిల్ తన ట్విట్టర్ ద్వార స్పందిస్తూ.. కంగ్రాట్స్ మామ.. చాలా సంతోషంగా ఉంది.. నేను వియాత్నం ఉండటం వల్ల సినిమా చూడలేకపోయాను.. ఇక్కడ ఒక స్పెషల్ షో వేయించవచ్చుగా.. టీమ్ అందరికీ కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేశాడు. ఇక నిఖిల్ ట్వీట్ కు నవీన్ స్పందిస్తూ..థ్యాంక్స్ బ్రో వియాత్నమా? తప్పకుండా బ్రో అడ్రస్ పెట్టు.. ముందు అడ్రస్ పెట్టు(నవ్వుతూ).. ఎప్పుడు వస్తున్నావు.. నీ రివ్యూ వినాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి ఫన్నీ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Thanks bro. Vietnam aa ? Sure bro address petu. Nuvvu address petu. Lol. When ru back ? Waiting to hear your review . Love from the team of #MissShettyMrPolishetty
— Naveen Polishetty (@NaveenPolishety) September 13, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.