వరుసగా నాలుగు రోజులు బాక్సాఫీస్ వద్ద 100కోట్లకు పైగా రాబట్టి రికార్డు సృష్టించిన జవాన్ సోమవారం కాస్త నెమ్మదించింది.నిన్న ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 54కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.అయితే నిన్న ఆసియా కప్ లో భాగంగా ఇండియా -పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది.ఆప్రభావం జవాన్ కలెక్షన్స్ ఫై కొద్దిగా పడింది.అయినా వర్కింగ్ డే లో బాగానే హోల్డ్ చేయగలిగింది.ఓవరాల్ గా జవాన్ 5రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 574.89కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇందులో నెట్ 280కోట్లు. ఈరోజుతో జవాన్ 300కోట్ల క్లబ్ లో చేరనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అతి తక్కువ రోజుల్లో 300కోట్లు రాబట్టిన మొదటి హిందీ సినిమా జవాన్ రికార్డు సృష్టించనుంది. ఇంతకుముందు ఈరికార్డు పఠాన్ పేరిట ఉండేది.ఈసినిమా 7రోజుల్లో ఈ ఫీట్ సాధించగా తాజాగా జవాన్ ఆ రికార్డును బ్రేక్ చేసింది.దాంతో షారుఖ్ తన రికార్డు ను తానే బ్రేక్ చేసుకోనున్నాడు.ఇక తెలుగు రాష్ట్రాల్లో జవాన్ జోరు కొనసాగుతుంది.నిన్న మరో 2కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.దాంతో మొత్తం 5 రోజుల్లో 36కోట్లకు పైగా వసూళ్లను ఖాతలో వేసుకుంది.
అట్లీ ఈసినిమాను తెరకెక్కించగా నయనతార,దీపికా పదుకోణ్ కథానాయికలుగా నటించారు.అనిరుద్ రవిచందర్ సంగీతం అందించాడు.రెడ్ చిల్లిస్ ఎంటెర్టైన్మెంట్ బ్యానర్ ఫై గౌరీ ఖాన్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























