డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నిఖిల్. ఈ ఏడాది ఇప్పటికే స్పై సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా స్వయంభూ. సోసియో ఫాంటసీ చిత్రంగా నిఖిల్ కెరీర్ లోనే భారీ స్థాయిలో ఈసినిమా వస్తుంది. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు చిత్రయూనిట్. మరోవైపు ఈసినిమా కేవలం ఇప్పటివరకూ నిఖిల్ ఫస్ట్ లుక్ అలానే సంయుక్త మీనన్ ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. అవే సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా కోసం ఇప్పటికే నిఖిల్ వియాత్నం వెళ్లిన సంగతి తెలిసిందే కదా. అక్కడే మూడు నెలల పాటు ఉండి ఆయుధాలు మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ లో శిక్షణ తీసుకోనున్నాడు. తాజాగా నిఖిల్ కూడా తన ట్విట్టర్ ద్వారా తను ఏ రేంజ్ లో కష్టపడుతున్నాడో చెబుతూ ఓ ఫొటో పోస్ట్ చేస్తూ తెలుపుతున్నాడు. టార్గెట్ దిశగా ట్రైనింగ్ అంటూ పోస్ట్ లో తెలిపాడు.
Working Towards the TARGET #Swayambhu Training… #martialarts #sword #swordfight pic.twitter.com/2GE1HklWnj
— Nikhil Siddhartha (@actor_Nikhil) September 13, 2023
కాగా కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాకు మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫి అందిస్తుండగా. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఎం.ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగరి డైలాగ్స్ అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.