సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ-స్టార్ హీరో కొడుకుతో సినిమా?

interesting update on sai pallavi bollywood entry

టాలెంటెడ్ నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.డ్యాన్స్‌, యాక్టింగ్ స్కిల్స్‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ‌. మలయాళ చిత్రం “ప్రేమమ్” తో హీరోయిన్ గా సిల్వర్ కు పరిచయమైంది సాయి పల్లవి. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత “ఫిదా” తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ బ్యూటీ… ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు బెస్ట్ హిట్ ను అందుకుంది. ఆతరువాత “ఎంసీఏ” తో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుని స్టార్ డమ్ ను అందుకుంది. ఆ తరువాత పలు సినిమాలను చేసి లేడి పవర్ స్టార్ అని పిలిపించుకునే రేంజ్ కు ఎదిగింది. రీసెంట్ గా శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం అయితే ఎలాంటి కమిట్ మెంట్స్ లేకుండా ఎంజాయ్ చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు సాయి పల్లవి గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే.. సాయి పల్లవి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తాజాగా కథనాలు జోరందుకున్నాయి. అంతేకాదు స్టార్ హీరో కొడుకుతో సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు అమీర్ ఖాన్. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ సరసన సాయి పల్లవి నటించబోతుందట. ఈ సినిమాకు సునీల్ పాండే దర్శకత్వం వహించబోతున్నాడని.. ఈసినిమాను లవ్ స్టోరీగా తెరకెక్కించబోతున్నాడని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 18 =