ఎంతో కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రజనీకి అటు అభిమానులకు జైలర్ సినిమా సూపర్ కిక్ ను ఇచ్చింది. ఈమధ్య కాలంలో వచ్చిన రజనీ సినిమాలు అన్నీ దాదాపు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూనే ఉన్నాడు. రజనీ రేంజ్ కు తగ్గ సాలిడ్ హిట్ ఒక్కటీ కూడా పడలేదు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నారు. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా రిలీజ్ అయిన జైలర్ ఆ కలను నిజం చేసింది. ఆగష్ట్ 10 వ తేదీన ఈసినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైనే కలెక్షన్స్ ను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసిన సంగతి తెలిసిందే కదా. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ లో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఓటీటీలో కూడా జైలర్ తన సత్తా చూపిస్తున్నాడు. రజనీకి ఇక్కడ మాత్రమే కాదు విదేశాల్లో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. దాని ప్రభావమే ఓటీటీ లో కనిపిస్తుంది. పలు దేశాల్లో జైలర్ అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ లో ఈ సినిమా టాప్ ట్రెండింగ్ లో నడుస్తుంది. దీంతో మరోసారి రజనీ విదేశాల్లో తనకు ఎంత క్రేజ్ ఉందో పరోక్షంగా తెలియచేశారు.
కాగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో ఇంకా రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, యోగిబాబు తదితరులు కీలకపాత్రల్లో నటించారు. అంతేకాదు శివ రాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ కూడా అతిథి పాత్రల్లో కనిపించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























