తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ.. విజయాలు అందుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ 2 సినిమాతో హిట్ ను అందుకున్న కార్తీ ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు రెడీ అయిపోయాడు. రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. కార్తీకి ఇది 25వ సినిమా. ఇక ఈసినిమా కూడా డిఫరెంట్ గా ఉండబోతుందని రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ తో అర్థమైపోయింది. ఈ గ్లింప్స్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. డిఫరెంట్ మేకోవర్ తో కార్తీ గెటప్ ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే తాజాగా కార్తీ తన డబ్బింగ్ పనులను మొదలుపెట్టాడు. ఇక ఈ విషయాన్ని తమ సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ ఒక చిన్న వీడియో కూడా రిలీజ్ చేశారు. వీడియో కార్తీ కర్మ అంటే ఏంటో తెలుసా అంటూ డబ్బింగ్ చెబుతుంటాడు. కానీ వాయిస్ సెట్ అవ్వదు. ఎన్నిసార్లు చెప్పినా వాయిస్ సెట్ అవ్వకపోవడంతో ఇప్పుడు ఓకే అవుతుంది అంటూ జపాన్ సినిమాలోని తన గెటప్ వేసుకొని వచ్చి డబ్బింగ్ చెబుతాడు. అప్పుడు వాయిస్ ఓకే అవుతుంది.
ఈ చిత్రంలో తొలిసారిగా కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. సునీల్ కూడా ‘జపాన్’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సునీల్ తమిళ్ లో అరంగేట్రం చేస్తుండటం మరో విశేషం. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి డీవోపీగా పని చేస్తున్నారు. మానగరం, ఖైదీ, తానక్కరన్, విక్రమ్ వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్న ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ వినేష్ బంగ్లాన్ ‘జపాన్’ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: