
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 251


డిఫరెంట్ గా అల్లరి నరేష్ మూవీ టైటిల్

యానిమల్ మూవీతో హనుమాన్ టీజర్- 800 స్క్రీన్స్ లో

ఓ కామెడీ సినిమా తీస్తా-సందీప్ రెడ్డి వంగా


సలార్ మేకర్స్ ఫ్రీ టికెట్ ఆఫర్


యానిమల్ సినిమా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

విశ్వక్ సేన్ గామి డబ్బింగ్ కంప్లీట్

హాయ్ నాన్న కు యూఎస్ లో సూపర్ క్రేజ్

యానిమల్ కు 100కోట్ల ఓపెనింగ్స్

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్- ఒలే ఒలే పాపాయి మాస్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్
వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈసినిమా డిసెంబర్8వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టశారు మేకర్స్. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీనిలోభాగంగానే ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేశారు. డేంజర్ పిల్లా అనే ఫస్ట్ సాంగ్ ను బ్రష్ వేసుకో అంటూ వచ్చే సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయగా.. రెండు పాటలు కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు మూడో పాటను రిలీజ్ చేయనున్నారు…

డిఫరెంట్ గా అల్లరి నరేష్ మూవీ టైటిల్
అల్లరి నరేష్ కూడా ఈమధ్య డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా ఉగ్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా పర్వాలేదనిపించింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. సోలో బ్రతుకే సో బెటరు ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. 1990 బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామా పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

మాలీవుడ్‍లో విషాదం.. ప్రముఖ నటి ఆర్ సుబ్బలక్ష్మి కన్నుమూత
మాలీవుడ్‍లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటి, సంగీత విద్వాంసురాలు ఆర్ సుబ్బలక్ష్మి కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కొచ్చి లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 87 ఏళ్ల సుబ్బలక్ష్మి ముఖ్యంగా అమ్మమ్మ పాత్రలలో అద్భుతమైన నటనతో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈ క్రమంలో సుబ్బలక్ష్మి అనేక దశాబ్దాల పాటు సాగిన కెరీర్‌లో బహుముఖ పాత్రల ద్వారా ప్రేక్షకులను అలరించారు.

యానిమల్ మూవీ రివ్యూ-రణబీర్ వన్ మ్యాన్ షో
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా రొటీన్ సినిమా అని మాత్రం చెప్పలేం. ఇలాంటి సినిమాలు రేర్ గా వస్తుంటాయి. ఈసినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చింది కాబట్టి, వయెలెన్స్ పాళ్లు కాస్త ఎక్కువగా ఉంది కాబట్టి పిల్లలను మినహాయిస్తే మిగిలిన వారు ఒక్కసారైనా చూసి ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఓటీటీలోకి వచ్చేసిన నాగచైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ దూత
అక్కినేని నాగచైతన్య ప్రధానపాత్రలో నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ 'దూత'. ఈ సిరీస్ ద్వారా చైతు తొలిసారి ఓటీటీలోకి అడుగుపెట్టారు. 'మనం' ఫేమ్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ 'దూత' వెబ్ సిరీస్.. ఒక్కో ఎపిసోడ్ సుమారు 40నిమిషాల నిడివితో మొత్తం 8 ఎపిసోడ్స్ గా రూపొందింది. ఇక ఇందులో డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్, పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్ తదితరులు నటించారు. దీనిని అమెజాన్ ప్రైమ్ వీడియో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం విశేషం. దీనికోసం ప్రైమ్ వీడియో ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ తాజాగా ప్రేక్షకుల…

యానిమల్ మూవీతో హనుమాన్ టీజర్- 800 స్క్రీన్స్ లో
విభిన్నమైన చిత్రాలు తీసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా హనుమాన్. `హనుమాన్` ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరోస్ నేపథ్యంలో సోషియో ఫాంటసీగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ.

ఓటీటీలోకి వచ్చేసిన రూల్స్ రంజన్
రత్నం కృష్ణ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన సినిమా రూల్స్ రంజన్. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా అక్టోబర్ 6వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ యాక్షన్ డ్రామా జోనర్ లో వచ్చిన ఈసినిమా మంచి విజయాన్ని అయితే అందుకోలేకపోయింది. ఇక ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో ఈసినిమా నేడు స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఓ కామెడీ సినిమా తీస్తా-సందీప్ రెడ్డి వంగా
అర్జున్ రెడ్డి సినిమాతోనే తన సత్తా ఏంతో చూపించాడు సందీప్ రెడ్డి వంగా. ఆసినిమాతోనే కొత్త ట్రెండ్ కు సైతం నాంది పలికాడు. ఇక ఇప్పుడు యానిమల్ అంటూ వయోలెన్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా వస్తున్న ఈసినిమా డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్,ట్రైలర్, పాటలు అన్నీ అంచనాలను మరింత పెంచేశాయి. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకా ఒక్క రోజు వెయిట్ చేయాల్సిందే.

అలా జరగకపొతే నా పేరు మార్చుకుంటా - హీరోయిన్ మృణాల్ ఠాకూర్
నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హాయ్ నాన్న'. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ వైజాగ్ లో ‘హాయ్ నాన్న’ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‍గా నిర్వహించింది.

హాయ్ నాన్న.. మనందరం తలెత్తుకొని గర్వంగా చెప్పగలిగే సినిమా - నేచురల్ స్టార్ నాని
నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హాయ్ నాన్న'. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలని పెంచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్…

సలార్ మేకర్స్ ఫ్రీ టికెట్ ఆఫర్
ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మరోవైపు అందరూ ఎదురుచూస్తుంది ఈసినిమా ట్రైలర్ కోసం. రేపు ఈసినిమా ట్రైలర్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఫ్యాన్స్ తో పాటు అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్.. వీడియో వైరల్
నేషనల్ అవార్డ్ విన్నర్, ఐకాస్ స్టార్ అల్లు అర్జున్.. తాను రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ హీరో అని ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్నారు. ఉన్నతమైన సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. స్వయంకృషితో టాలీవుడ్‌లో స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. ఇదే క్రమంలో తన అద్భుత నటనతో ఇటీవలే జాతీయ ఉత్తమ నటుడు అవార్డును సైతం అందుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరో ఆయనే కావడం గమనార్హం. అయితే ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వం కలిగిన అల్లు అర్జున్.. అటు సినిమాల పరంగానే కాకుండా ఇటు నిజ జీవితంలోనూ తనదైన ప్రవర్తనతో పలువురికి ఆదర్శంగా నిలుస్తుంటారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా తన వంతుగా అడిగిన…

ఓటీటీలో దూసుకుపోతున్న భగవంత్ కేసరి
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా అక్టోబర్ 19న విడుదలై మంచి విజయం సాధించింది. ఎమోషనల్ ప్లస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకొని ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఓటేసిన మెగాస్టార్ చిరంజీవి, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్ సహా పలువురు సినీ ప్రముఖులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరుగుతోంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవగా.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. దీంతో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమ ప్రాంతాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఈ సందర్భంగా సామాన్య ప్రజలే కాకుండా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు విచ్చేసారు. కొంతమంది తమ కుటుంబ సభ్యులతో కలిసి సమీపంలోని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.

యానిమల్ సినిమా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నహీరోయిన్ గా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ఇంకా ఒక్క రోజులో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.

విశ్వక్ సేన్ గామి డబ్బింగ్ కంప్లీట్
యంగ్ హీరో విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉగా అందులో గామి సినిమా కూడా ఒకటి. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమాలో విశ్వక్ అఘోరా పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టాడు విశ్వక్. అయితే పలు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈసినిమా లేట్ అయింది.

హాయ్ నాన్న కు యూఎస్ లో సూపర్ క్రేజ్
శౌర్యువ్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. తల్లీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుంది. మరోవారం రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి.

హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రా ఆర్డినరీ గిఫ్ట్ అందించిన ఎంఎస్ ధోనీ
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ నటిస్తోన్న తాజా చిత్రం 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సీనియర్ రైటర్ కమ్ డైరెక్టర్, 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' ఫేమ్ వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ మరియు ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.

యానిమల్ కు 100కోట్ల ఓపెనింగ్స్
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా యానిమల్.ఈసినిమా మ్యాడ్ క్రేజ్ సొంతం చేసుకుంటుంది. ఇంతకుముందుసందీప్-రణబీర్ కాంబో లో వచ్చిన అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ హిందీలో సెన్సేషన్ సృష్టించింది దాంతో సహజంగానే యానిమల్ కు అనౌన్స్ మెంట్ దగ్గరి నుండే హైప్ క్రీయేట్ అయ్యింది.ఆ తరువాత టీజర్ ఆ హైప్ ను ఇంకొంచెం పెంచేసింది అయితే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ మాత్రం ఊహించని బజ్ ను తీసుకొచ్చింది.కేవలం హిందీ లోనే కాదు తెలుగులోనూ అదే హైప్ కొనసాగుతుంది.పేరుకే బాలీవుడ్ సినిమా కానీ తెలుగులో ఓ పెద్ద హీరో సినిమా వస్తుంటే ఎంతటి హైప్ ఉంటుందో అలా వుంది…

హనుమాన్‌లో అలాంటి షాట్ ఒక్కటి కూడా వుండదు - దర్శకుడు ప్రశాంత్ వర్మ
దర్శకుడు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా లీడ్ రోల్ నటించిన ఒరిజినల్ సూపర్ హీరో చిత్రం 'హను-మాన్'. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ సూపర్ హీరో హనుమాన్‌ని లాంచ్ చేసి ప్రమోషన్స్ లో దూకుడు పెంచారు. బాలల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ పాట చిన్నారులతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకుంది. తాజాగా మంగళవారం, హనుమాన్ టీమ్ చిత్రంలోని మూడవ సింగిల్ ఆవకాయ ఆంజనేయ సాంగ్‌ని గ్రాండ్‍గా లాంచ్ చేశారు. అనుదీప్ దేవ్ అద్భుతంగా స్వరపరిచిన మాసీ బీట్‌లతో కూడిన ఈ గ్రూవీ ఫోక్ సాంగ్ ఆకట్టుకుంటోంది.