శౌర్యువ్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. తల్లీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుంది. మరోవారం రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరి నాని సినిమాలకు ఓవర్సీస్ లో మంచి క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే కదా. అది మరోసారి రుజువైంది. ఇక ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్స్ యూఎస్ లో మొదలైపోయాయి. ఈనేపథ్యంలో ఈసినిమాకు అక్కడ మంచి రెస్పాన్స్ వస్తున్నట్టు అర్థమవుతుంది. రిలీజ్ కు ఇంకా వారం రోజులు ఉండగానే అప్పుడే ప్రీ సేల్స్ ద్వారా దాదాపు 25K డాలర్లను సొంతం చేసుకున్నట్టు సమాచారం. రాబోయే రోజుల్లో ప్రీ సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.
ఇక ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా..హృదయం ఫేమ్‌కు చెందిన ప్రముఖ మలయాళ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.వి.మోహన్, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: