ఓటేసిన మెగాస్టార్‌ చిరంజీవి, జూ.ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ సహా పలువురు సినీ ప్రముఖులు

TS Assembly Elections: Megastar Chiranjeevi, Jr NTR, Allu Arjun and Many Celebrities Cast Their Vote

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరుగుతోంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ మొదలవగా.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. దీంతో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమ ప్రాంతాల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఈ సందర్భంగా సామాన్య ప్రజలే కాకుండా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు విచ్చేసారు. కొంతమంది తమ కుటుంబ సభ్యులతో కలిసి సమీపంలోని పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ జూబ్లీహిల్స్ క్లబ్‌లోని పోలింగ్‌ బూత్ లో ఓటు వేశారు. చిరు వెంట ఆయన సతీమణి సురేఖ మరియు చిన్న కుమార్తె శ్రీజ ఉన్నారు. నటుడు సుమంత్‌ కూడా ఇదే కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. తల్లి షాలిని, భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి వచ్చి ఓటు వేశారు. వీరు జూబ్లీహిల్స్‌లోని పీ ఓబుల్‌రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ పోలింగ్‌ బూత్‌ 153లో ఓటు వేశారు. వీరితో పాటుగా స్టార్ హీరోలు వెంకటేశ్‌, నితిన్‌‌, శ్రీకాంత్‌, ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, ఎస్ఎస్ రాజమౌళి, తేజ మరియు ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి తదితరులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. కాగా వీరందరూ సామాన్య జనంతో పాటు క్యూ లైన్‌లో నిలబడి మరీ ఓటు వేయడం గమనార్హం. ఇక ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. తమ వంతు బాధ్యతగా ఓటు వేశామని, మీరు కూడా మీ బాధ్యత ప్రకారం ఓటు వేయాలని అభిమానులకు మరియు ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =