వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈసినిమా డిసెంబర్8వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టశారు మేకర్స్. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీనిలోభాగంగానే ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేశారు. డేంజర్ పిల్లా అనే ఫస్ట్ సాంగ్ ను బ్రష్ వేసుకో అంటూ వచ్చే సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయగా.. రెండు పాటలు కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు మూడో పాటను రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలోనే మూడో పాటకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఒలే ఒలే పాపాయి అంటూ వచ్చే మాస్ సాంగ్ ను రేపు అంటే డిసెంబర్ 2వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Get Ready For #ExtraOrdinary Massive Dance blast Of @actor_nithiin & @sreeleela14 in 2️⃣Days 🕺💃#OleOlePaaPaayi song releasing on december 2nd 🥁💥 #ExtraOrdinaryMan#ExtraOrdinaryManOnDec8th@ActorRajasekhar @vamsivakkantham @Jharrisjayaraj @AlwaysJani #SudhakarReddy pic.twitter.com/BPi5WTDZYS
— Sreshth Movies (@SreshthMovies) November 30, 2023
కాగా ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: