అక్కినేని నాగచైతన్య ప్రధానపాత్రలో నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘దూత’. ఈ సిరీస్ ద్వారా చైతు తొలిసారి ఓటీటీలోకి అడుగుపెట్టారు. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ ‘దూత’ వెబ్ సిరీస్.. ఒక్కో ఎపిసోడ్ సుమారు 40నిమిషాల నిడివితో మొత్తం 8 ఎపిసోడ్స్ గా రూపొందింది. ఇక ఇందులో డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్, పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్ తదితరులు నటించారు. దీనిని అమెజాన్ ప్రైమ్ వీడియో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం విశేషం. దీనికోసం ప్రైమ్ వీడియో ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 1 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘దూత’ కథ ఏంటంటే..?
జర్నలిస్ట్ సాగర్ వర్మ (నాగచైతన్య), భార్య ప్రియా (ప్రియా భవానీ శంకర్)తో కలిసి జీవిస్తుంటాడు. కొత్తగా ప్రారంభమైన సమాచార్ దిన పత్రికలో చీఫ్ ఎడిటర్ గా పనిచేస్తుంటాడు. అందులో పనిచేసే జర్నలిస్ట్ అమృత (ప్రాచీ దేశాయ్) అతనికి పీఏగా ఉంటుంది. ఈ క్రమంలో ఒక రోజు సాగర్ ఇంటికి వెళుతుండగా.. ఓ ధాబా దగ్గర కారు ఆగుతుంది. ధాబాలోకి వెళ్లిన ఆయన అక్కడ అనుకోకుండా ఓ పేపర్ కటింగ్ చూస్తాడు. అయితే విచిత్రంగా దానిలో రాసినట్టుగానే కారుకు యాక్సిడెంట్ జరిగి పెంపుడు కుక్క మరణిస్తుంది. దీని తర్వాత మరికొన్ని పేపర్ కటింగ్స్ సాగర్ వర్మ కంట పడతాయి. వాటిలో రాసినట్లే వరుస ప్రమాదాలు జరుగుతుంటాయి. దీనిని తెలుసుకునేందుకు సాగర్ శోధన మొదలుపెడతాడు.
అయితే, అసలు ఈ సంఘటనలు జరగడానికి కారణం ఏమిటి? ఇలా జరగబోయే ప్రమాదాన్ని ముందుగా పేపర్లలో రాస్తున్నది ఎవరు? స్వాతంత్య్ర సమరయోధుడు, ‘దూత’ పత్రిక నిర్వాహకుడు సత్యమూర్తి (పశుపతి), పోలీస్ అజయ్ ఘోష్ (రవీంద్ర విజయ్) పాత్రలు ఏమిటి? సాగర్ వర్మ కథకు.. కొన్నేళ్లుగా జరుగుతున్న జర్నలిస్టుల ఆత్మహత్యలకు సంబంధం ఏమిటి? ఈ కేసును ఎస్పీ క్రాంతి షినోయ్ (పార్వతి తిరువొతు) ఎలా సాల్వ్ చేశారు? తన మొదటి సినిమా ’13బి’ తర్వాత మళ్ళీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ రూపొందించిన డైరెక్టర్ విక్రమ్ ఈ మేరకు సక్సెస్ అయ్యాడా? అనేది తెలియాలంటే.. ఈ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: