డిఫరెంట్ గా అల్లరి నరేష్ మూవీ టైటిల్

Allari Naresh New Movie Title Announcement

అల్లరి నరేష్ కూడా ఈమధ్య డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా ఉగ్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా పర్వాలేదనిపించింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. సోలో బ్రతుకే సో బెటరు ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. 1990 బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ డ్రామా పాయింట్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈసినిమా టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. బచ్చల మల్లి అనే టైటిల్‌ను ఈ సినిమాను ఫిక్స్ చేశారు. ఈనేపథ్యంలో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ అయితే ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకుంది.

కాగా ఈసినిమాలో రావు రమేష్, హరితేజ, ప్రవీణ్ పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించనున్నారు.విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. మానాడు, రంగం, మట్టి కుస్తీ చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ కెమరామెన్ గా పని చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. దర్శకుడు సుబ్బు స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, విప్పర్తి మధు స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 8 =