మాలీవుడ్‍లో విషాదం.. ప్రముఖ నటి ఆర్ సుబ్బలక్ష్మి కన్నుమూత

Veteran Malayalam Actress and Musician R Subbalakshmi Passed Away

మాలీవుడ్‍లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటి, సంగీత విద్వాంసురాలు ఆర్ సుబ్బలక్ష్మి కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కొచ్చి లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 87 ఏళ్ల సుబ్బలక్ష్మి ముఖ్యంగా అమ్మమ్మ పాత్రలలో అద్భుతమైన నటనతో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈ క్రమంలో సుబ్బలక్ష్మి అనేక దశాబ్దాల పాటు సాగిన కెరీర్‌లో బహుముఖ పాత్రల ద్వారా ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సుబ్బలక్ష్మి మృతికి మలయాళ చిత్ర పరిశ్రమతో పాటు మరియు మలయాళ టెలివిజన్‌ రంగం కూడా సంతాపం తెలిపింది. ఆయా రంగాలకు ఆమె విశేషమైన సేవలు అందించారని, ఆమె మృతి తీరని లోటు అని పేర్కొన్నాయి. కాగా సుబ్బలక్ష్మి ప్రతిభావంతులైన నటి మాత్రమే కాదు, దక్షిణ భారతదేశంలో ఆల్ ఇండియా రేడియోలో మొదటి మహిళా స్వరకర్తగా కూడా చరిత్ర సృష్టించారు. అలాగే ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేశారు. ‘కళ్యాణరామన్’ (2002), ‘పండిప్పాడ’ (2005), ‘నందనం’ (2002) వంటి చిత్రాలలో ఆమె నటన మలయాళ సినీ ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసింది.

ఇక ఆమె నటిగానే కాకుండా మలయాళంలో 65కి పైగా సీరియల్స్‌లో నటించారు. వీటిలో ‘శ్రీమహాభాగవతం’, ‘కుంజిక్కూనన్’, ‘ఒరు పెన్నింటే కథ’ మరియు ‘సీతా కళ్యాణం’ వంటి ధారావాహికలలో ఆమె ప్రభావవంతమైన పాత్రలను పోషించారు. ఆమె చివరిసారిగా ‘సుధామణి సూపరా’ అనే సీరియల్ లో ఒక ప్రధాన పాత్రలో నటించారు. కాగా నటుడు తారా కళ్యాణ్ సుబ్బలక్ష్మి కుమారుడే కావడం గమనార్హం. ఇక ఆమె ఒక తెలుగు సినిమాలోనూ నటించడం విశేషం. నాగచైతన్య, సమంత జంటగా నటించిన ‘ఏ మాయ చేసావే’ సినిమాలో.. సమంత అమ్మమ్మగా సుబ్బలక్ష్మి కనిపించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =