విభిన్నమైన చిత్రాలు తీసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా హనుమాన్. `హనుమాన్` ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరోస్ నేపథ్యంలో సోషియో ఫాంటసీగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా టీజర్ ను మరోసారి రిలీజ్ చేయనున్నారు. రేపు అంటే డిసెంబర్ 1వ తేదీన యానిమల్ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా రిలీజ్ థియేటర్లలో హనుమాన్ టీజర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. యూఎస్ లోని దాదాపు 800 థియేటర్లలో టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు మేకర్స్.
Experience the Majestic #HanuMan teaser on Big screens with #AnimalTheFilm in over 800 Screens in the USA 🇺🇸 🔥
A @prasanthvarma Film
🌟ing @tejasajja123In Theaters WW from JAN 12th, 2024💥@Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @GowrahariK @Primeshowtweets… pic.twitter.com/n3UlqN2KE3
— Primeshow Entertainment (@Primeshowtweets) November 30, 2023
కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. ఈసినిమాను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: