అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా యానిమల్.ఈసినిమా మ్యాడ్ క్రేజ్ సొంతం చేసుకుంటుంది. ఇంతకుముందుసందీప్-రణబీర్ కాంబో లో వచ్చిన అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ హిందీలో సెన్సేషన్ సృష్టించింది దాంతో సహజంగానే యానిమల్ కు అనౌన్స్ మెంట్ దగ్గరి నుండే హైప్ క్రీయేట్ అయ్యింది.ఆ తరువాత టీజర్ ఆ హైప్ ను ఇంకొంచెం పెంచేసింది అయితే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ మాత్రం ఊహించని బజ్ ను తీసుకొచ్చింది.కేవలం హిందీ లోనే కాదు తెలుగులోనూ అదే హైప్ కొనసాగుతుంది.పేరుకే బాలీవుడ్ సినిమా కానీ తెలుగులో ఓ పెద్ద హీరో సినిమా వస్తుంటే ఎంతటి హైప్ ఉంటుందో అలా వుంది అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అలాగే వున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆల్రెడీ బుక్ మై షో లో 2లక్షలకు పైగా టిక్కెట్లు తెగాయి.కేవలం ఓపెనింగ్స్ తోనే ఈసినిమా 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ వుంది.దేశ వ్యాప్తంగా అన్ని వెర్షన్ లు కలుపుకొని 60కోట్ల ఓపెనింగ్స్ రాబట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉండగా ఓవర్సీస్ లో 40కోట్ల రేంజ్ లో వసూళ్లను రాబట్టుకోనుంది దాంతో తొలి రోజే 100కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం సాధ్యమయ్యాలేనా వుంది.
తండ్రి కొడుకల కథతో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా రణబీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ కనిపించనున్నాడు.హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈసినిమాను టి సిరీస్ నిర్మించింది.3గంటల 21నిమిషాల లాంగ్ రన్ టైంతో డిసెంబర్ 1న యానిమల్ థియేటర్లోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: