అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా అక్టోబర్ 19న విడుదలై మంచి విజయం సాధించింది. ఎమోషనల్ ప్లస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకొని ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. అమెజాన్ ప్రైమ్ లో ఈసినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈసినిమా ఓటీటీలో కూడా దూసుకుపోతుంది. సూపర్ రెస్పాన్స్ తో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. సినిమాలోని ఎమోషనల్ కంటెంటే ఈసినిమాకు ఇంత రెస్పాన్స్ రావడానికి కారణమని తెలుస్తుంది.
కాగా కాజల్ హీరోయిన్ గా నటించగా శ్రీలీల మరో కీలక పాత్రలో నటించింది. ఇప్పటివరకూ గ్లామర్ రోల్స్ చేసిన శ్రీలీల ఈసినిమాలో పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ చేసింది. అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటించాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈసినిమాకు
సినిమాటోగ్రఫి.. సి.రామ్ ప్రసాద్, సంగీతం.. ఎస్ థమన్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: