అర్జున్ రెడ్డి సినిమాతోనే తన సత్తా ఏంతో చూపించాడు సందీప్ రెడ్డి వంగా. ఆసినిమాతోనే కొత్త ట్రెండ్ కు సైతం నాంది పలికాడు. ఇక ఇప్పుడు యానిమల్ అంటూ వయోలెన్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా వస్తున్న ఈసినిమా డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్,ట్రైలర్, పాటలు అన్నీ అంచనాలను మరింత పెంచేశాయి. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకా ఒక్క రోజు వెయిట్ చేయాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే డిఫరెంట్ సినిమాలు తీసే సందీప్ రెడ్డి కామెడీ సినిమా తీస్తే ఎలా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. అయితే ఈ విషయాన్ని తానే స్వయంగా తెలియచేశాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రెడ్డి ఈ విషయాన్ని తెలియచేశాడు. ఇంటెన్స్ జోనర్ లో కాకుండా తనకు కామెడీ జోనర్ లో సినిమా తీయాలని చెప్పుకొచ్చాడు. అయితే టిపికల్ కామెడీ జోనర్ లో కాకుండా ఒక డిఫరెంట్ కామెడీ ఫిలిం అయితే తీస్తానని తెలిపాడు. చూద్దాం మరి సందీప్ నుండి కామెడీ సినిమా వస్తే ఎలా ఉంటుందో..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: