గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్.. వీడియో వైరల్

Icon Star Allu Arjun Heartwarming Gesture Video For Their Maid

నేషనల్ అవార్డ్ విన్నర్, ఐకాస్ స్టార్‌ అల్లు అర్జున్‌.. తాను రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ హీరో అని ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్నారు. ఉన్నతమైన సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. స్వయంకృషితో టాలీవుడ్‌లో స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. ఇదే క్రమంలో తన అద్భుత నటనతో ఇటీవలే జాతీయ ఉత్తమ నటుడు అవార్డును సైతం అందుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరో ఆయనే కావడం గమనార్హం. అయితే ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వం కలిగిన అల్లు అర్జున్‌.. అటు సినిమాల పరంగానే కాకుండా ఇటు నిజ జీవితంలోనూ తనదైన ప్రవర్తనతో పలువురికి ఆదర్శంగా నిలుస్తుంటారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా తన వంతుగా అడిగిన వారికి కావాల్సిన సాయం చేయడానికి ముందుంటారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వివరాల్లోకి వెళ్తే.. అల్లు అర్జున్ తాజాగా ఒక సెల్ఫీ వీడియో తీశారు. అందులో తమ ఇంట్లో పనిచేసే అమ్మాయితో కలిసి కనిపించారు. ఈ సందర్భంగా వీడియోలో.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారని అడుగగా.. ఆమె 13 వేలు అని సమాధానం ఇచ్చింది. అయితే తను ఇంకా ఎంత మంది ఫాలోవర్స్ కావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తోందని మళ్ళీ అడిగారు అల్లు అర్జున్. అందుకు ఆమె 30 వేలు అని చెప్పింది. అయితే, ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత అంతమంది వస్తారా? అని ప్రశ్నించగా.. దానికి ఆమె నమ్మకంగా అవును అని సమాధానమిచ్చింది. దీంతో అల్లు అర్జున్ నవ్వుతూ.. సరే, నువ్వు కోరుకున్నది జరగాలని ఆశిద్దాం అని బదులిచ్చారు. కాగా ఈ సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజెన్ల అల్లు అర్జున్ గొప్ప మనసును ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.

ఇక ఇదిలా ఉండగా.. ఐకాన్ స్టార్ ప్రస్తుతం ‘పుష్ప: ది రైజ్‌’కి సీక్వెల్‌గా రూపొందుతోన్న ‘పుష్ప 2: ది రూల్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అల్లు అర్జున్‌ సరసన కథానాయికగా నటిస్తుండగా.. సునీల్, రావు రమేష్, అనసూయ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా చేస్తుండగా.. టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా ఈరోజు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. అల్లు అర్జున్‌ హైదరాబాద్ బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ పోలింగ్‌ బూత్‌ 153లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =