రత్నం కృష్ణ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన సినిమా రూల్స్ రంజన్. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా అక్టోబర్ 6వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ యాక్షన్ డ్రామా జోనర్ లో వచ్చిన ఈసినిమా మంచి విజయాన్ని అయితే అందుకోలేకపోయింది. ఇక ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో ఈసినిమా నేడు స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో నేహాశెట్టి హీరోయిన్ గా నటించగా..హైపర్ ఆది, వైవా హర్ష, సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దివ్యంగ్ లావానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందించాడు.
ఇక కథ విషయానికి వస్తే.. హీరో ముంబైలోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. కాలేజ్ రోజుల్లో అతను ప్రేమించిన అమ్మాయి, హఠాత్తుగా అతని జీవితంలోకి ఎంటరవుతుంది. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేదే కథ.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: