యానిమల్ సినిమా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

animal movie interesting elements

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నహీరోయిన్ గా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ఇంకా ఒక్క రోజులో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సందీప్ రెడ్డి వంగా
ఇక ఈసినిమాకు ముందు ఇంత హైప్ రావడానికి కారణం డైరెక్టర్ సందీప్ వంగాా రెడ్డి అన్న సంగతి తెలిసిందే కదా. అర్జున్ రెడ్డి సినిమాతో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు సందీప్. కల్ట్ లవ్ స్టోరీ తీసి సంచలన విజయం సాధించి కొత్త ట్రెండ్ ను సైతం క్రియేట్ చేసాడు. ఇక ఇదే సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. దీంతో సందీప్ కు నేషనల్ వైడ్ గా మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఇప్పుడు యానిమల్ తో వస్తున్నాడు. ఈసినిమాకు కూడా మంచి బజ్ క్రియేట్ అయింది.

రణబీర్ కపూర్
ఈసినిమాకు మరో ప్రధాన ఆకర్షణ రణబీర్ కపూర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రణ బీర్ యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లవర్ బాయ్ పాత్ర అయినా, ఇన్నోసెంట్ పాత్ర అయినా రాక్ స్టార్ లాంటి సినిమాలో కేర్ లెస్ పాత్రలో అయినా.. బర్ఫీ సినిమాలో డిజార్డర్ ఉన్న పాత్ర అయినా ఇలా ఏ పాత్ర అయినా సరే అందురో జీవించేస్తాడు. ఇప్పుడు ఫుల్ వయోలంట్ గా రాబోతున్నాడు. నెవర్ బిఫోర్ అవతార్ లో కనిపించనున్నాడు. పొడవాటి జుట్టు, గడ్డం, రగ్డ్ లుక్ తో ఈసినిమాలో కనిపించనున్నాడు.

కథ
కథ కూడా ఈసినిమాకు ప్రధానం బలం కానున్నట్టు తెలుస్తుంది. తండ్రిని కొడుకు ఎంత ప్రేమిస్తాడు.. అతని కోసం ఎలాంటి రిస్క్ అయినా చేయడానికి సిద్దపడతాడు.. అన్న పాయింట్ తో ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కించాడు సందీప్ రెడ్డి. దానికి కాస్త వయోలెన్స్ ను కూడా జోడించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై సూపర్ బజ్ ను క్రియేట్ చేశాయి.

కాంబినేషన్స్
ఈసినిమాలో రణ్ బీర్ తో పాటు అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ లాంటి సీనియర్ యాక్టర్స్ కూడా నటిస్తున్నారు. అంతేకాదు నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ లలో చూసినట్టుగా అనిల్ కపూర్-రణ్ బీర్ కపూర్ కాంబినేషన్ కు మంచి రెస్పాన్స్ వచ్చేలా కనిపిస్తుంది. తన తండ్రి అనిల్ ను చూస్తూ పెరిగిన రణబీర్ అంతకంటే పెద్ద డాన్ అవ్వడానికి ట్రై చేయడం..ఆ నేపథ్యంలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, అలానే నెగెటివ్ పాత్రలో చేసిన బాబి డియోల్ పాత్ర అన్ని హైలెట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇంకా రష్మికతో ఉండే లవ్ ట్రాక్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ కూడా ఆకట్టుకునేలా ఉంది.

టెక్నికల్ బ్రిలియన్స్
ఈసినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తున్నాయి. కార్ ఛేజింగ్ లు, పెద్ద పెద్ద వెపన్స్ ఇలా పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అంతేకాదు ఇంటర్వెల్ బ్లాక్ ముందు వచ్చే 18 నిమిషాల యాక్షన్ బ్లాక్ కూడా గూజ్ బంప్స్ తెప్పించేలా ఉందన్న వార్తలు అయితే ఇప్పటికే వచ్చాయి. ఇక ఈసినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతుందని అర్థమవుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.