మోస్ట్ అవైటెడ్ మూవీ యానిమల్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వంలో రణబీర్ హీరోగా మోస్ట్ వయోలెన్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను రూపొందించారు. ఇక ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలను పెంచాయి తప్పా ఎక్కడా తగ్గించలేదు. ఈనేపథ్యంలోనే ఎన్నో అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. రణబీర్ కపూర్, రష్మిక, అనిల కపూర్, బాబి డియోల్ తదితరులు
దర్శకత్వం.. సందీప్ రెడ్డి వంగా
బ్యానర్స్..టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్
నిర్మాతలు.. భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్
సంగీతం..హర్ష వర్ధన్ రామేశ్వర్
సినిమాటోగ్రఫి..అమిత్ రాయ్
కథ
ఈసినిమా టీజర్, ట్రైలర్ ను చూస్తేనే అర్థమవుతుంది తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన సినిమా అని. తండ్రి మీద విపరీతమైన ప్రేమ కలిగిన ఒక కొడుకు.. తండ్రి కోసం ఎంత క్రూరంగా మారాడు.. తండ్రిని చంపాలనుకున్న శత్రువులను ఎలా మట్టుపెట్టాడు అనేది ఈసినిమా కథ..
అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించాడు సందీప్ వంగా. ఈసినిమాతో విజయ్ దేవరకొండను ఒక్కసారిగా స్టార్ హీరోని చేసేశాడు. ఇప్పుడు దానికి పదింతలు అనేలా యానిమల్ మూవీతో వచ్చాడు. అర్జున్ రెడ్డి సినిమాలో కల్ట్ ప్రేమను చూపిస్తే ఈసినిమాలో తండ్రి కొడుకల అనుబంధాన్ని చూపించాడు. అయితే దానికి కాస్త ఎమోషనల్ ను కాస్త వయోలెన్స్ ను జోడించాడు. నిజానికి ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ బాండింగ్ తో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. అయితే ఏ కథనైనా ఎంత కొత్తగా, ఎంగేజింగ్ గా చూపిస్తున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆ విషయంలో సందీప్ మాత్రం ఫుల్ మార్కులు కొట్టేశాడు. ఈ పాయింట్ ను స్క్రీన్ పై చూపించడంలో సక్సెస్ అయ్యాడు.
ఇక సందీప్ వంగా మేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన మేకింగ్ చాలా బోల్డ్ గా ఉంటుంది. ఆవిషయం అర్జున్ రెడ్డితోనే ప్రూవ్ చేశాడు. చెప్పాలనుకున్న పాయింట్ ను తన స్టైల్ లోనే చెబుతాడు. యానిమల్ లోనూ ఆ మార్క్ డైరెక్షన్ ఉంది. అక్కను ర్యాగింగ్ చేసిన వాళ్ళను గన్ పట్టుకుని కాలేజీకి హీరో వెళ్లి బెదిరించడం.. విమానంలో ఫస్ట్ నైట్ సీన్, బోల్డ్ డైలాగ్స్ ఇవన్నీ సందీప్ మేకింగ్ స్టైల్. ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా ఓ రేంజ్ లో తీశాడు. ముఖ్యంగా సినిమా కాస్త లెంగ్త్ ఎక్కువ అయితే ఆడియన్స్ బోర్ ఫీలవుతుంటారు.. కానీ మూడున్నర గంటల సినిమా అయినా కూడా ఎక్కడా ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వకుండా తీయడం సందీప్ కే ఆ ఘనత చెందుతుంది.
పెర్ఫామెన్స్
ఈసినిమాకు బ్యాక్ బోన్ రణబీర్ కపూర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం. వన్ మ్యాన్ షో అని చెప్పాలి. నిజానికి నటుడిగా రణబీర్ కపూర్ ప్రూవ్ చేసుకోవాల్సింది ఏం లేదు. తన కెరీర్ లో ఎన్నో మంచి పాత్రల్లో నటించాడు. ఇక ఈసినిమాతో మరో మెట్టు ఎక్కేశాడు. ఒక టిపికల్ పాత్రలో తన నటనతో, యాటిట్యూడ్ తో సినిమాకు ప్రాణం పోశాడు. రణబీర్ తరువాత చెప్పకోవాల్సిన పాత్రలు అనిల్ కపూర్ ఇంకా బాబి డియోల్ పాత్రలు. తండ్రి పాత్రలో అనిల్ కపూర్ చాలా బాగా నటించాడు. కొడుకు ఒక సైకో మాదిరిగా బిహేవ్ చేస్తుంటే తండ్రి గా దాన్ని చూసి తట్టుకోలేని పాత్రలో సెటిల్డ్ నటనతో ఆకట్టుకుంటాడు. ఇక ఏసినిమాలో అయినా హీరోకు తగ్గ విలన్ ఉండాలి. ఆ విషయంలో సందీప్ విలన్ గా బాబి డియోల్ ను తీసుకోవడం మాత్రం బెస్ట్ ఛాయిస్ అని చెప్పాలి. విలన్ పాత్రలో బాబి డియోల్ కూడా చెలరేగిపోయాడు. ఇక హీరోయిన్ గా నటించిన రష్మికకు కూడా రెగ్యులర్ పాత్ర కాకుండా యాక్టింగ్ కు స్కోప్ ఉండే పాత్రే దక్కింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర బాగానే నటించారు.
టెక్నిల్ వాల్యూస్
ఈసినిమాకు సాంకేతిక విభాగం కూడా ప్రధాన బలంగా మారింది. ఈసినిమాకు అమిత్ రాయ్ అందించిన సినిమాటోగ్రఫి పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది. కొన్ని విజువల్స్ అయితే చాలా అద్బుతంగా వచ్చాయి. ఇక సంగీతం కూడా ఈసినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. ఈసినిమాలో పాటలు కూడా ఆకట్టుకున్నాయి. అలానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ గా నిలిచింది. మరో హైలెట్ ఏంటంటే ఈసినిమాకు సందీప్ వంగానే ఎడిటర్ గా కూడా పనిచేయడం. ఒక డైరెక్టర్ గా తనకు ఏ సీన్ ఎంతవరకూ.. ఎక్కడ ఉండాలో పర్ఫెక్ట్ గా తెలుసుకాబట్టి సినిమా 3గంటల పైన ఉన్నా కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కథను ట్రిమ్ చేయలేదు. ఇక నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.
హైలెట్స్
ఈసినిమాలో హైలెట్ విషయాలు చెప్పుకోవాలంటే ఎమోషన్, బాండింగ్, క్యారెక్టర్స్ జస్టిఫికేషన్, సందీప్ కథ, ఎంగేంజింగ్ స్క్రీన్ ప్లే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఈ సినిమాలో సందీప్ తండ్రి కొడుకుల ఎమోషన్ ని చాలా అద్భుతంగా చూపించాడు సందీప్. రణబీర్ కపూర్-అనిల్ కపూర్ మధ్య వచ్చే ప్రతి సీన్, ఒక్కో ఎమోషన్ అనేది సినిమాకి స్ట్రాంగ్ పిల్లర్ గా నిలిచింది.
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా రొటీన్ సినిమా అని మాత్రం చెప్పలేం. ఇలాంటి సినిమాలు రేర్ గా వస్తుంటాయి. ఈసినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చింది కాబట్టి, వయెలెన్స్ పాళ్లు కాస్త ఎక్కువగా ఉంది కాబట్టి పిల్లలను మినహాయిస్తే మిగిలిన వారు ఒక్కసారైనా చూసి ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: