హనుమాన్‌లో అలాంటి షాట్ ఒక్కటి కూడా వుండదు – దర్శకుడు ప్రశాంత్ వర్మ

Hanuman Director Prasanth Varma Reveals Interesting Facts About This Fantasy Adventure

దర్శకుడు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా లీడ్ రోల్ నటించిన ఒరిజినల్ సూపర్ హీరో చిత్రం ‘హను-మాన్’. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ సూపర్ హీరో హనుమాన్‌ని లాంచ్ చేసి ప్రమోషన్స్ లో దూకుడు పెంచారు. బాలల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ పాట చిన్నారులతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకుంది. తాజాగా మంగళవారం, హనుమాన్ టీమ్ చిత్రంలోని మూడవ సింగిల్ ఆవకాయ ఆంజనేయ సాంగ్‌ని గ్రాండ్‍గా లాంచ్ చేశారు. అనుదీప్ దేవ్ అద్భుతంగా స్వరపరిచిన మాసీ బీట్‌లతో కూడిన ఈ గ్రూవీ ఫోక్ సాంగ్ ఆకట్టుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. “ఆవకాయ ఆంజనేయ పాట చాలా ప్రత్యేకం. ఈ పాటతోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టాం. టీజర్ తో సినిమాకి చాలా మంచి హైప్ వచ్చింది. జనాల్ని చాలా ఆకట్టుకుంది. సినిమాపై చాలా అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా ఎలా ఉండబోతుంది? ఏ జానర్ లలో వుంటుంది? పూర్తిగా మైథాలజికల్ ఉంటుందా? సినిమాల హనుమంతుడు ఉంటారా లేదా? ఇలా చాలా ఆసక్తిరమైన ప్రశ్నలు వున్నాయి. అయితే తర్వాత విడుదల చేస్తున్న ఒకొక్క ప్రమోషనల్ మెరటిరియల్ తో సినిమాలో ఏముంటుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మొదటి పాట హనుమాన్ చాలీసా.. సినిమాలో చాలా ముఖ్యమైన భక్తి గీతం. తర్వాత విడుదల చేసిన సూపర్ హీరో పాటతో ఈ సినిమా చూసి చిన్నపిల్లలు ఎంత వినోదాన్ని పొందవచ్చో అర్ధమైవుంటుంది” అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఇప్పుడు ఆవకాయ ఆంజనేయ ద్వారా సినిమాలో ఎంత మాస్, యాక్షన్, ఫన్ ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇది అసలు సిసలైన సంక్రాంతి సినిమా. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ చూడదగ్గ సినిమా. సినిమాలో ఒక్క ధూమపానం, మద్యపానంకు సంబధించిన ఒక్క షాట్ కూడా వుండదు. టోటల్ క్లీన్ ఫిల్మ్ ఇది. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలసి చూడదగ్గ సినిమా. కథ చాలా ఆసక్తికరంగా వుంటుంది. చాలా ఎంటర్ టైనింగ్‌గా చెప్పాం. ఇప్పటివరకూ నేను చేసిన చిత్రాలలో హనుమాన్ మోస్ట్ ఎంటర్ టైనింగ్ మూవీ. ఆవకాయ ఆంజనేయ పాటని అనుదీప్ అద్భతంగా కంపోజ్ చేశారు. తేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాను వివిధ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. దానికి తగ్గట్లు ప్రతి భాషకు చాలా కేర్ తీసుకుంటున్నాం. వేరే భాషలో చూసినప్పుడు డబ్బింగ్ సినిమాలా అనిపించకుండా ఒరిజినల్ ఫీలింగ్‌నే కలిగిస్తుంది. నిర్మాత నిరంజన్ గారు ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని చాలా గ్రాండ్‍గా నిర్మించారు. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.

కాగా ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్‌, వినయ్‌ రాయ్‌, రాజ్ దీపక్‌ శెట్టి, వెన్నెల కిశోర్‌, సత్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇక ఈ మాగ్నమ్ ఓపస్‌కి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందించగా.. ప్రొడక్షన్ డిజైనర్ గా శ్రీనాగేంద్ర తంగాల వ్యవహరించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ సహా పలు ఇతర భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతోంది. ఈ క్రమంలో ‘హనుమాన్’ సినిమాను మొత్తం 12 భాషల్లో డబ్ చేస్తున్నామని, కొన్ని విదేశీ భాషల్లో సైతం రిలీజ్ చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + seven =