
ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 2


RAPO20 ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం

ఉస్తాద్ భగత్ సింగ్ - కీ షెడ్యూల్ కోసం భారీ సెట్

తిరుపతి లో ప్రభాస్

అభిమానులకు బన్నీ రిక్వెస్ట్

టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఫుల్ యాక్షన్ తో ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్

జెంటిల్‌మెన్ 2 కంపోజింగ్ త్వరలో ప్రారంభం

ఘనంగా జరిగిన శర్వానంద్ పెళ్లి వేడుక

ఆదిపురుష్ కు అతిథిగా చిన్న జీయర్ స్వామి

ఫిదా ఫస్ట్ ఛాయిస్ మహేష్ బాబు, దీపికా

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక ఖరారు

బిచ్చగాడు మూవీకి మహేష్ పర్ఫెక్ట్ ఛాయిస్

తెలుగులోకి వస్తున్నసెన్సేషనల్ మూవీ

మంచి డిమాండ్ లో ఆదిపురుష్ తెలుగు రైట్స్

PKSDT టైటిల్,ఫస్ట్ లుక్ అప్డేట్

NBK 108 టైటిల్ ,ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి బాలకృష్ణ ,అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కతున్న సినిమా ఎన్ బి కె 108(వర్కింగ్ టైటిల్ ).ప్రస్తుతం సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో వుంది.ఈసినిమా నుండి ఇప్పటికే విడుదలైన బాలకృష్ణ పోస్టర్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమానుండి బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఈనెల 8న టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదలకానుంది.ఈటైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉండనుందట. బాలయ్య సినిమాలకు వుండే రెగ్యులర్ టైటిల్స్ లా కాకుండా పూర్తిగా భిన్నంగా వుండనుందట.

RAPO20 ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం
ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా RAPO 20. క్రేజీ కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండి భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాను పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. దాదాపు షూటింగ్ చివరి దశకు కూడా చేరుకుంది. రీసెంట్ ఈసినిమా క్లైమాక్స్ షూట్ కు సంబంధించి క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు రామ్.

ఉస్తాద్ భగత్ సింగ్ - కీ షెడ్యూల్ కోసం భారీ సెట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక షూటింగ్ దశలో ఉండగానే మరోపక్క ఎడిటింగ్ పనులను కూడా మొదలుపెట్టేశారు. ఇక ఇప్పుడు మరో కీ షెడ్యూల్ కు రెడీ అవుతుంది చిత్రయూనిట్. ఈనేపథ్యలోనే దీని కోసం భారీ సెట్ ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఆద్వర్యంలో ఈ సెట్ ను అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. ఈ సెట్ లో సినిమాలోని పలు కీలక సన్నివేశాలను…

తిరుపతి లో ప్రభాస్
రెబల్ స్టార్ ప్రభాస్ తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు.నిన్న రాత్రి ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకున్న ప్రభాస్ ఈరోజు తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకొని సుప్రభాత సేవలో పాల్గొన్నాడు.ఇక ఈరోజు తిరుపతి లో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో సాయంత్రం 5గంటలకు ఈవేడుక ప్రారంభం కానుంది.ఈ ఈవెంట్ కు ప్రభాస్ తోపాటు సినిమా యూనిట్ అంతా హాజరుకానుంది.

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లలో హైలెట్స్
దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా అందులోనూ రామాయణం నేపథ్యంలో ఈసినిమా వస్తుండటంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అందుకు తగ్గట్టే ఈసినిమాను భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా రూపొందించారు. మరికొద్ది రోజుల్లో సినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం కూడా భారీ స్థాయిలో మునుపెన్నడూ జరగని విధంగా.. గుర్తుండుపోయేలా చేస్తున్నారు. అంతేకాదు…

అభిమానులకు బన్నీ రిక్వెస్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి కూడా విదితమే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సంచలన విజయాన్ని అందించింది. ఈసినిమాతోనే పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చిన బన్నీ మొదటి ప్రయత్నంతోనే దేశవ్యాప్తంగా తన ఇంపాక్ట్ ను చూపించాడు. ఎంతోమంది ఫ్యాన్స్ ను సైతం దక్కించుకున్నాడు. ఇక మొదటిపార్ట్ సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టి పార్ట్ 2 పై పడింది. ఇక ఆదిశగానే షూటింగ్ కూడా జరుగుతుంది. సుకుమార్ సాలిడ్ కథనే తయారుచేశాడంటున్నారు.

టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ ఫిక్స్
యువ హీరో సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్ లో నటించిన డీజే టిల్లు అనూహ్యవిజయాన్ని సాధించింది. ఈసినిమాలో సిద్దు యాక్టింగ్ యూత్ ను ఫిదా చేసింది.దాంతో డీజే టిల్లు బాక్సాఫీస్ ను షేక్ చేసింది.ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.టిల్లు స్క్వేర్ టైటిల్ తో వస్తున్న ఈసీక్వెల్ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుటుంది.ఇందులో సిద్దు సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండగా మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.డీజే టిల్లు ను విమల్ కృష్ణ డైరెక్ట్ చేయగా నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.

ఫుల్ యాక్షన్ తో ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్. ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రామాయణం నేపథ్యంలో వస్తున్న సినిమా ఇది. ఈసినిమా ఈనెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

జెంటిల్‌మెన్ 2 కంపోజింగ్ త్వరలో ప్రారంభం
‘జెంటిల్‌మన్' నిర్మాత కె.టి. కుంజుమోన్' సౌత్ ఇండియన్ సినిమా ప్రముఖ నిర్మాతలలో ఒకరు. అద్భుతమైన చిత్రాలని నిర్మించిన బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించారు. శరత్‌కుమార్, దర్శకుడు శంకర్ వంటి గొప్ప ప్రతిభావంతులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన అరుదైన రికార్డ్ ఆయన సొంతం. గ్రాండ్ గా సినిమాలను నిర్మించడం, తన సినిమాలను ప్రమోట్ చేయడంలో ప్రత్యేకమైన శైలిని అనుసరించడంలో ఆయన పేరుపొందారు. ఇప్పుడు 'జెంటిల్‌మన్ 2' ద్వారా నిర్మాతగా ఆయన కమ్ బ్యాక్ గురించి ఇండస్ట్రీ, ట్రేడ్ సర్కిల్ మొత్తం ఆనందం వ్యక్తం చేస్తోంది.

ఘనంగా జరిగిన శర్వానంద్ పెళ్లి వేడుక
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ల సంఖ్య తగ్గిపోతుంది. ఈ రెండేళ్లలో ఎంతోమంది టాలీవుడ్ హీరోలు పెళ్లిచేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అసలు పెళ్లి చేసుకోను అని చెప్పిన రానానే పెళ్లి చేసుకోవడంతోనే చాలా మంది షాకయ్యారు. ఇక ఇప్పుడు ఆ బ్యాచ్ లర్ల్ లో లిస్ట్ లో మొదటి వరుసలో ఉన్న హీరో శర్వానంద్ కూడా ఓ ఇంటివాడయ్యాడు. తెలంగాణ హైకోర్ట్ న్యాయవాది మదుసూదన్ రెడ్డి కుమార్తె, రక్షితారెడ్డితో జనవరిలో శర్వా నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే కదా. ఐదు నెలల తర్వాత ఇప్పుడు వీరి వివాహం జరిగింది. రాజస్థాన్, జైపూర్ లోని శ్రీలీల ప్యాలెస్ లో శర్వానంద్ వివాహ వేడుక ఘనంగా జరిగింది.

భోళా శంకర్ నుండి భోళా మేనియా సాంగ్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది గాడ్ ఫాదర్ తో హిట్ ను కొట్టగా.. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక అదే జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా భోళా శంకర్. వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒకవైపు షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టారు.

ఆదిపురుష్ కు అతిథిగా చిన్న జీయర్ స్వామి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆదిపురుష్. రాామాయణం ఆధారంగా ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఎన్నో సార్లు వాయిదా పడిన అనంతరం ఈసినిమా ఫైనల్ గా జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కు మరికొద్ది రోజులు మాత్రమే ఉండటంతో చిత్రయూనిట్ కూడా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేసింది. మరోవైపు ఒక్కొక్కటిగా పాటలు రిలీజ్ చేస్తున్నారు. పాటలకు కూడా బాగా రెస్పాన్స్ వస్తుంది.

ఫిదా ఫస్ట్ ఛాయిస్ మహేష్ బాబు, దీపికా
ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాలు మరో హీరో చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. డేట్లు లేకనో లేక కథకు తాము కరెక్ట్ కాదనో పలు కారణాల వల్ల ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేయాల్సి ఉంటుంది. దానివల్ల కొందరూ సూపర్ హిట్లు కూడా మిస్ అవ్వొచ్చు. కొందరూ ఫ్లాప్ సినిమాల నుండి తప్పించుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా దేనికంటే ఓ సూపర్ హిట్ మూవీలో ఒక క్రేజీ కాంబినేషన్ చేయాల్సి ఉంది.. కానీ పలు కారణాల వల్ల ఆ కాంబినేషన్ లో సినిమా రాలేదు. ఇంతకీ ఆ కాంబినేషన్ ఎవరిది? ఏంటా సినిమా అనుకుంటున్నారా? అదే వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ఫిదా సినిమా.. ఆ కాంబినేషన్ మహేష్ బాబు, దీపికా…

ఆదిపురుష్ కోసం బైక్ పై తిరుపతికి రానున్న మ్యూజిక్ డైరెక్టర్
ఈనెల 6న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతి లో జరుగనుందని తెలిసిందే.ఈఈవెంట్ ను గ్రాండ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.ఏకంగా కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టి గ్రాండ్ గా జరుపనున్నారు. అంతేకాదు ఈఈవెంట్ లోచాలా సప్రైజ్ లు కూడా వున్నాయి.ఇక ఇదిలావుంటే ఈసినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ ద్వయం అజయ్- అతుల్ సంగీతం అందించారు.వారుసంగీతం అందించిన జై శ్రీరామ్ సాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.ఇక వీరిలో అతుల్ ముంబై నుండి బైక్ మీద తిరుపతి లోజరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రానున్నాడు.

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక ఖరారు
మచ్ అవైటెడ్ ఆదిపురుష్ విడుదలకు సమయం దగ్గర పడుతుండడం తో ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేసారు మేకర్స్.అందులో భాగంగా ఈనెల 6న తిరుపతి లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియం లో సాయంత్రం 5గంటలకు ప్రారంభంకానుంది.ఈఈవెంట్ కోసం చాలా ఖర్చు చేసి ఎన్నడూ జరగని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో జరుపనున్నారు.ఈఈవెంట్ కోసం ముంబై నుండి 200మంది సింగర్లు అలాగే 200మంది డ్యాన్సర్లు రానున్నారు అలాగే ప్రత్యేకమైన టపాకాయలను తెప్పించనున్నారు. వీటికోసం భారీగా ఖర్చు చేయనున్నారు.

అన్నీ మంచి శకునములే మూవీకి జనరల్ ఆడియన్స్ రివ్యూస్ ఇవ్వండి
సంతోష్ శోభన్ హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా “అన్నీ మంచి శకునములే” అన్న టైటిల్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈ సినిమాా మే 18వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్, పోస్టర్లతో సినిమాను మంచి బజ్ క్రియేట్ చేసుకున్న చిత్రయూనిట్ ట్రైలర్ తో ఆ అంచనాలను మరింత పెంచేసింది.

బిచ్చగాడు మూవీకి మహేష్ పర్ఫెక్ట్ ఛాయిస్
తమిళ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని నుండి ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా బిచ్చగాడు 2. ఈసినిమా 2016లో వచ్చి బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించడమే కాకుండా విజయ్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను అందించింది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

తెలుగులోకి వస్తున్నసెన్సేషనల్ మూవీ
మలయాళం లో సెన్సేషన్ సృష్టిస్తున్న సినిమా 2018.మే 5న విడుదలైన ఈసినిమా కేవలం 11 రోజుల్లో నే ప్రపంచవ్యాప్తంగా 100కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది.ఓవర్సీస్ లో అయితే సుమారు 50కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది.ఓవరాల్ గా మాలీవుడ్ లో 100 కోట్లు వసూళ్లను రాబట్టిన మూడో సినిమా 2018 రికార్డు సృష్టించింది.9వ రోజు ఒక్క కేరళ లోనే 5కోట్ల గ్రాస్ ను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.2018లో కేరళలో సంభవించిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో టోవినో థామస్,అసిఫ్ అలీ,లాల్,అపర్ణ బాలమురళి తదితరులు కీలకపాత్రల్లో నటించారు.ప్రముఖ డైరెక్టర్ జూడ్ అంథాని జోసెఫ్ తెరకెక్కించిన ఈసినిమాను వేణు…

మంచి డిమాండ్ లో ఆదిపురుష్ తెలుగు రైట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆదిపురుష్. రాామాయణం ఆధారంగా ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఎన్నో సార్లు వాయిదా పడిన అనంతరం ఈసినిమా ఫైనల్ గా జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రభాస్ పలు పోస్టర్లు అలానే హనుమాన్ ఇంకా సీత పాత్రలకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది

PKSDT టైటిల్,ఫస్ట్ లుక్ అప్డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మొదటి సారి కలిసి నటిస్తున్న చిత్రం PKSDT (వర్కింగ్ టైటిల్).ఈసినిమా షూటింగ్ తుదిదశకు చేరుకుంది.పవన్ పార్ట్ షూటింగ్ ఎప్పుడో పూర్తి కాగా ప్రస్తుతం మిగితా క్యాస్ట్ పై చిత్రీకరణను పూర్తి చేస్తున్నారు.కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ వినోదయ సీతం కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో పవన్ దేవుడి పాత్రలో కనిపించనున్నాడు.ఇక ఈసినిమా నుండి ఫ్యాన్స్ ఎప్పటినుండో అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.