పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆదిపురుష్. రాామాయణం ఆధారంగా ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఎన్నో సార్లు వాయిదా పడిన అనంతరం ఈసినిమా ఫైనల్ గా జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కు మరికొద్ది రోజులు మాత్రమే ఉండటంతో చిత్రయూనిట్ కూడా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేసింది. మరోవైపు ఒక్కొక్కటిగా పాటలు రిలీజ్ చేస్తున్నారు. పాటలకు కూడా బాగా రెస్పాన్స్ వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను ఖరారు చేసిన సంగతి తెలిసిందే కదా. రేపు అంటే జూన్ 6వ తేదీన తిరుపతి లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియం లో సాయంత్రం 5గంటల నుండి ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది. ఈ వేడుకకు ఆద్యాత్మిక గురైన చిన్న జీయర్ స్వామి అతిథిగా రానున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.
The Spiritual Aura around #Adipurush Pre-Release is in PEAK🔥#ChinnaJeeyarSwamy Garu to grace as prominent guest 🙏
Witness #AdipurushPreReleaseEvent, Tomorrow from 5PM 💥
Live Link▶️ https://t.co/TyskRJMa4D
In cinemas worldwide on June 16th 🛕#Prabhas @omraut #SaifAliKhan… pic.twitter.com/o7mV2MQ1Ha
— UV Creations (@UV_Creations) June 5, 2023
ఇక ఈసినిమాలో ప్రభాస్ రాముడిగా కృతిసనన్ సీతగా నటించగా సైఫ్ అలీఖాన్ రావణాసురిడిగా కనిపించనున్నాడు. ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలపై బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అజయ్ -అతుల్ సంగీతం అందించారు. ఆదిపురుష్ తెలుగు తోపాటు ఇతర భాషల్లో భారీ స్థాయిలో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: