NBK 108 టైటిల్ ,ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

NBK 108 title and first look gets a release date

నందమూరి బాలకృష్ణ ,అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కతున్న సినిమా ఎన్ బి కె 108(వర్కింగ్ టైటిల్ ).ప్రస్తుతం సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో వుంది.ఈసినిమా నుండి ఇప్పటికే విడుదలైన బాలకృష్ణ పోస్టర్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమానుండి బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఈనెల 8న టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదలకానుంది.ఈటైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉండనుందట. బాలయ్య సినిమాలకు వుండే రెగ్యులర్ టైటిల్స్ లా కాకుండా పూర్తిగా భిన్నంగా వుండనుందట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ లీల కీలక పాత్రలో కనిపించనుంది.బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ గా నటిస్తున్నాడు. తెలుగులో అతనకిదే మొదటి సినిమా.థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ నిర్మిస్తుంది.ఈ దసరా కు సినిమా విడుదలకానుంది.

ఇక బాలకృష్ణ ఈనెల 10న తన బర్త్ డే ను జరుపుకోనున్నారు.ఆ రోజున తన నెక్స్ట్ మూవీ అనౌన్స్మెంట్ కూడా రానుందని సమాచారం.గత ఏడాది అఖండతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన బాలకృష్ణ ఈఏడాది సంక్రాంతికి వీర సింహ రెడ్డి తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు.మరి తన 108వ చిత్రంతో హ్యాట్రిక్ కొడతాడో లేదో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =