సంతోష్ శోభన్ హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా “అన్నీ మంచి శకునములే” అన్న టైటిల్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈ సినిమాా మే 18వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్, పోస్టర్లతో సినిమాను మంచి బజ్ క్రియేట్ చేసుకున్న చిత్రయూనిట్ ట్రైలర్ తో ఆ అంచనాలను మరింత పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగాా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రయూనిట్ తాజాగా ఇన్స్టా గ్రామ్ ద్వారా లైవ్ సెషన్ ను నిర్వహించారు. ఈసందర్బంగా డైరెక్టర్ నందినీ రెడ్డి జనరల్ ఆడియన్స్ ను తమ రివ్యూస్ ను తమ ట్విట్టర్ల ద్వారా పోస్ట్ చేయమని అడిగారు. ఆడియన్స్ నుండి వచ్చే పాజిటివ్ రివ్యూస్ టీమ్ కు మంచి బూస్ట్ ను ఇస్తాయని తెలిపారు. అంతేకాదు జనరల్ ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేస్తారు.. కానీ రివ్యూవర్స్ అయితే సినిమాను ఎనలైజ్ చేయడానికి ట్రై చేస్తారు.. అందుకే పబ్లిక్ తమ థాట్స్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయమని అడిగారు. మరి నందినీ రెడ్డి రిక్వెస్ట్ మేరకు జనరల్ ఆడియన్స్ రివ్యూస్ ను పోస్ట్ చేస్తారా ?లేదా?అని చూడాలి.
కాగా స్వప్న సినిమా, మిత్ర వింద మూవీస్ బ్యానర్లపై ప్రియాంక దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈసినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. వెన్నెల కిషోర్, రావు రమేష్, నరేష్, గౌతమి, రాజేంద్ర ప్రసాద్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: