పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్. ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రామాయణం నేపథ్యంలో వస్తున్న సినిమా ఇది. ఈసినిమా ఈనెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమాా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టీజర్ తో ఈసినిమాపై వచ్చిన విమర్శలను ట్రైలర్ తో తిప్పి కొట్టింది చిత్రయూనిట్. ఒక్క ట్రైలర్ తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా మారిపోయాయి. నిజానికి సినిమా ప్రారంభానికి ముందు ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.. అయితే ఎప్పుడైతో టీజర్ రిలీజ్ అయిందో గ్రాఫిక్స్ విషయంలో సినీ ప్రేక్షకులతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా పెదవి విరిచారు. దీంతో మేకర్స్ ఇంకాస్త టైమ్ తీసుకొని.. జాగ్రత్తగా గ్రాఫిక్స్ విషయంతో శ్రద్ద పెట్టి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే విజువల్ వండర్ ఉండి మళ్లీ పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసింది.
ఇప్పుడు ఆ అంచనాలను మరింత రెట్టింపు చేయడానికి సెకండ్ ట్రైలర్ తో రావడానికి సిద్దమవుతున్నారు మేకర్స్. ఈసినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ రేపు జూన్ 6వ తేదీన తిరుపతిలో ఘనంగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఆద్యాత్మిక గురువి చిన్న జీయర్ స్వామి సైతం అతిధిగా విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా రేపు సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉంటుందని అంటున్నారు.
కాగా 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలపై బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: