బిచ్చగాడు మూవీకి మహేష్ పర్ఫెక్ట్ ఛాయిస్

mahesh babu perfect choice for bichagadu movie says vijay antony

తమిళ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని నుండి ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా బిచ్చగాడు 2. ఈసినిమా 2016లో వచ్చి బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించడమే కాకుండా విజయ్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను అందించింది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగానే తెలుగు ప్రమోషన్స్ కోసం హైద్రాబాద్ లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు చిత్రయూనిట్. ఈసందర్భంగా విజయ్ ఆంటోని తను కాకపోతే బిచ్చగాడు సినిమాకు ఎవరు పర్ఫెక్ట్ గా సూట్ అవుతారో అన్న ప్రశ్నకు సమాధానంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే ఈ పాత్రకు పర్ఫెక్ట్ ఛాయిస్ అని.. తను అయితే ఈపాత్రను పర్ఫెక్ట్ గా క్యారీ చేయగలడని తెలియచేశాడు. ఇక తమిళ్ వెర్షన్ లో ఈపాత్రకు ఇళయ దళపతి విజయ్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని తెలిపాడు.

ఈసినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. దేవ్ గిల్, హరీష్ పెరడి, జాన్ విజయ్, రాధా రవి, మన్సూర్ అలీ ఖాన్, వైజీ మహేంద్రన్, రాజా కృష్ణమూర్తి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఓం నారాయణన్ అందిస్తున్నారు. సంగీతాన్ని కూడా విజయ్ ఆంటోని అందిస్తున్నారు. ఇక ఫాతిమా విజయ్ ఆంటోని ‘విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్’ పతాకంపై ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి ఈసినిమాను విడుదల చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =