మచ్ అవైటెడ్ ఆదిపురుష్ విడుదలకు సమయం దగ్గర పడుతుండడం తో ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేసారు మేకర్స్.అందులో భాగంగా ఈనెల 6న తిరుపతి లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియం లో సాయంత్రం 5గంటలకు ప్రారంభంకానుంది.ఈఈవెంట్ కోసం చాలా ఖర్చు చేసి ఎన్నడూ జరగని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో జరుపనున్నారు.ఈఈవెంట్ కోసం ముంబై నుండి 200మంది సింగర్లు అలాగే 200మంది డ్యాన్సర్లు రానున్నారు అలాగే ప్రత్యేకమైన టపాకాయలను తెప్పించనున్నారు. వీటికోసం భారీగా ఖర్చు చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈఈవెంట్ కు సినిమా యూనిట్ అంతా హాజరుకానుంది దాంతో పాటు తెలుగు రాష్ట్రాలనుండి ఫ్యాన్స్ కూడా భారీ సంఖ్యలో హాజరుకానున్నారు.ఇక అలాగే ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రెండో ట్రైలర్ ను కూడా విడుదలచేయనున్నారట.ఈట్రైలర్ కూడా అదిరిపోతుందని టాక్.
ఇక ఈసినిమా ఫై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో ప్రభాస్ రాముడిగా కృతిసనన్ సీతగా నటించగా సైఫ్ అలీఖాన్ రావణాసురిడిగా కనిపించనున్నాడు.భారీ బడ్జెట్ తో రిట్రో ఫిలిమ్స్,టి సిరీస్,యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించగా అజయ్ -అతుల్ సంగీతం అందించారు.ఈనెల 16న ఆదిపురుష్ తెలుగు తోపాటు ఇతర భాషల్లో భారీ స్థాయిలో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: