PKSDT టైటిల్,ఫస్ట్ లుక్ అప్డేట్ 

#PKSDT Movie Title & First Look Release Date Locked

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మొదటి సారి కలిసి నటిస్తున్న చిత్రం PKSDT (వర్కింగ్ టైటిల్).ఈసినిమా షూటింగ్ తుదిదశకు చేరుకుంది.పవన్ పార్ట్ షూటింగ్ ఎప్పుడో పూర్తి కాగా ప్రస్తుతం మిగితా క్యాస్ట్ పై చిత్రీకరణను పూర్తి చేస్తున్నారు.కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ వినోదయ సీతం కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో పవన్ దేవుడి పాత్రలో కనిపించనున్నాడు.ఇక ఈసినిమా నుండి ఫ్యాన్స్ ఎప్పటినుండో అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఎట్టకేలకు వారి ఎదురుచూపులకు తెర పడనుంది.రేపు ఈసినిమా నుండి అప్డేట్ రానుందని మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.రేపు సాయంత్రం 4:14గంటలకు టైటిల్,ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు.ఈసినిమాను సముద్రఖని  డైరెక్ట్ చేస్తుండగా కేతిక శర్మ,ప్రియా ప్రకాష్ వారియర్,బ్రహ్మజీ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.థమన్ సంగీతం అందిస్తున్నాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,జీ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.జూలై 28న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఇక ఈసినిమా తరువాత పవన్ మరో మూడు సినిమాల్లో నటిస్తున్నాడు.ప్రస్తుతం అవి షూటింగ్ స్టేజి లో వున్నాయి.అందులో క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు,హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే సుజీత్ డైరెక్షన్ లో ఓజి లో నటిస్తున్నాడు.సాయి ధరమ్ తేజ్ మాత్రం తన నెక్స్ట్ మూవీ ని ఇంకా  కన్ఫర్మ్ చేసుకోలేదు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =