RAPO20 ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం

rapo20 movie final schedule begin today in mysore

ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా RAPO 20. క్రేజీ కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండి భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాను పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. దాదాపు షూటింగ్ చివరి దశకు కూడా చేరుకుంది. రీసెంట్ ఈసినిమా క్లైమాక్స్ షూట్ కు సంబంధించి క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు రామ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చింది శ్రీలీల. తన ఇన్ట్సా లో రామ్ తో కలిసి ఉన్న ఫొటో ను పోస్ట్ చేస్తూ ఆల్ మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.. లాస్ట్ షెడ్యూల్ తన హోమ్ టౌన్ అయిన కర్ణాటక మైసూర్ లో జరపనున్నట్టు తెలిపింది. ఇక నేడు మైసూర్ లో లాస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఈనెల 15వరకూ ఈ లాస్ట్ షెడ్యూల్ జరగనున్నట్టు తెలుస్తుంది. ఒక పాట మినహా షూట్ మొత్తం పూర్తవనున్నట్టు సమాచారం. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా త్వరగానే పూర్తి చేయాలని చూస్తున్నారు మేకర్స్. లాస్ట్ షెడ్యూల్ అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా త్వరగానే పూర్తి చేయాలని చూస్తున్నారు మేకర్స్.

 

View this post on Instagram

 

A post shared by Sreeleela (@sreeleela14)

కాగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాను కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్ 20వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =