ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లలో హైలెట్స్

huge arrangements for adipurush movie pre release event

దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా అందులోనూ రామాయణం నేపథ్యంలో ఈసినిమా వస్తుండటంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అందుకు తగ్గట్టే ఈసినిమాను భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా రూపొందించారు. మరికొద్ది రోజుల్లో సినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం కూడా భారీ స్థాయిలో మునుపెన్నడూ జరగని విధంగా.. గుర్తుండుపోయేలా చేస్తున్నారు. అంతేకాదు ఎన్నో హైలెట్స్ కూడా ఉండబోతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

* ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి హాజరు కానున్నారు. ఈవెంట్ లో పాల్గొని చిత్రయూనిట్ కు ఆశీస్సులు అందజేయనున్నారు.

* ఈ ఈవెంట్ కోసం తిరుపతిలోనే అయోధ్య యొక్క భారీ సెట్‌ ను ఏర్పాటు చేశారు.

* ఇంకా తెలుగు సినీ చరిత్రలోనే మొదటిసారిగా ఈ ఈవెంట్ లో 50 అడుగుల ప్రభాస్ హోలోగ్రామ్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.

* ఈ ఈవెంట్లో 100 మంది డ్యాన్సర్లు, 100 మంది గాయకులు ప్రదర్శన ఇవ్వనున్నారు.

కాగా 3డీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లపై బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =