ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాలు మరో హీరో చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. డేట్లు లేకనో లేక కథకు తాము కరెక్ట్ కాదనో పలు కారణాల వల్ల ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేయాల్సి ఉంటుంది. దానివల్ల కొందరూ సూపర్ హిట్లు కూడా మిస్ అవ్వొచ్చు. కొందరూ ఫ్లాప్ సినిమాల నుండి తప్పించుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా దేనికంటే ఓ సూపర్ హిట్ మూవీలో ఒక క్రేజీ కాంబినేషన్ చేయాల్సి ఉంది.. కానీ పలు కారణాల వల్ల ఆ కాంబినేషన్ లో సినిమా రాలేదు. ఇంతకీ ఆ కాంబినేషన్ ఎవరిది? ఏంటా సినిమా అనుకుంటున్నారా? అదే వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ఫిదా సినిమా.. ఆ కాంబినేషన్ మహేష్ బాబు, దీపికా పదుకొనేది. వినడానికే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.. అసలు సంగతేంటంటే..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ డైరెక్టర్ జయంత్ సీ పరాన్జీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రేమించుకుందాం రా అనే సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తరువాత చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయంత్ ఫిదా గురించి ప్రస్తావిస్తూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేసారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల నా వద్దకు వచ్చి ఫిదా స్టోరీ చెప్పాడు.. అది మహేష్ బాబు కోసం రాసుకున్నానని కూడా చెప్పాడు. అయితే అన్ని కుదిరితే మహేష్ బాబుకి జోడీగా దీపికా పదుకొనే ని తీసుకుని శేఖర్ డైరెక్టర్ గా నేను ఆ మూవీని నిర్మిద్దాం అనుకున్నాను. అంతేకాదు మహేష్ కి కూడా కథ చెప్పగా ఆయన కూడా ఎంతో ఇంప్రెస్ అయ్యారు. కానీ ఫ్యాన్స్ తమ హీరోల నుండి డిఫరెంట్ సినిమాలు ఆశిస్తారని, అందుకే అలోచించి ఆ ప్రాజక్ట్ మహేష్ కి సరిపోదు అనే విషయాన్ని శేఖర్ కమ్ములకి చెప్పానని తెలిపారు. ఆ తరువాత తను వరుణ్ తేజ్, సాయి పల్లవిలతో ఈసినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడని తెలియని విషయాలను తెలియచేశారు. మరి ఈసినిమా మహేష్ తీస్తే ఎలా ఉండేదో తెలియదు కానీ వరుణ్ తేజ్-సాయి పల్లవి కెరీర్లకు మాత్రం మంచి ప్లస్ పాయింట్ అయింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: