మలయాళం లో సెన్సేషన్ సృష్టిస్తున్న సినిమా 2018.మే 5న విడుదలైన ఈసినిమా కేవలం 11 రోజుల్లో నే ప్రపంచవ్యాప్తంగా 100కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది.ఓవర్సీస్ లో అయితే సుమారు 50కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది.ఓవరాల్ గా మాలీవుడ్ లో 100 కోట్లు వసూళ్లను రాబట్టిన మూడో సినిమా 2018 రికార్డు సృష్టించింది.9వ రోజు ఒక్క కేరళ లోనే 5కోట్ల గ్రాస్ ను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.2018లో కేరళలో సంభవించిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో టోవినో థామస్,అసిఫ్ అలీ,లాల్,అపర్ణ బాలమురళి తదితరులు కీలకపాత్రల్లో నటించారు.ప్రముఖ డైరెక్టర్ జూడ్ అంథాని జోసెఫ్ తెరకెక్కించిన ఈసినిమాను వేణు కున్నపిల్లి,పద్మా కుమార్,అంటో జోసెఫ్ నిర్మించారు. నోబిన్ పౌల్ సంగీతం అందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఈసినిమా తెలుగులో కూడా విడుదలకానుంది.తెలుగుతోపాటు మిగితా దక్షాణాది భాషల్లో విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు.అందులోభాగంగా రేపు ఈసినిమా ట్రైలర్ ను తెలుగు,కన్నడ,తమిళ భాషల్లో రేపు సాయంత్రం 6గంటలకు విడుదలకానుంది.ట్రైలర్ తోపాటు విడుదలతేదీని కూడా ప్రకటించనున్నారు.ఇక కంటెంట్ నచ్చితే ఇతర భాషల సినిమాలను ప్రోత్సహించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పడు ముందుంటారు.మరి ఈసినిమా తెలుగు లో ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందనేది ఆసక్తిగా మారింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: