పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆదిపురుష్. రాామాయణం ఆధారంగా ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఎన్నో సార్లు వాయిదా పడిన అనంతరం ఈసినిమా ఫైనల్ గా జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రభాస్ పలు పోస్టర్లు అలానే హనుమాన్ ఇంకా సీత పాత్రలకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ తో ఒక్కసారిగా సినిమాపై ఉన్న అభిప్రాయం తలక్రిందులై పోయింది. టీజర్ తో వచ్చిన నెగిటివిటీని ట్రైలర్ తో పటా పంచలు చేశారు మేకర్స్. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఏ గ్రాఫిక్స్ అయితే బాలేదని టీజర్ కు విమర్శలు దక్కాయో.. ఇప్పుడ అదే గ్రాఫిక్స్ కు ప్రశంసలు దక్కాయి. ట్రైలర్ విజువల్ వండర్ గా ఉందన్న అభిప్రాయాలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.
ఈనేపథ్యంలో ఈసినిమా తెలుగు రైట్స్ కు ఫుల్ డిమాండ్ పెరిగినట్టు తెలుస్తుంది. ఈసినిమా తెలుగు రైట్స్ యూవీ క్రియేషన్స్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే తమ లైన్ లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ కు ఈసినిమా తెలుగు హక్కులను పెద్ద మొత్తంలో అమ్మనున్నట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా ప్రీరిలీజ్ బిజినెట్ పెద్ద మొత్తంలో జరగనున్నట్టు అర్థమవుతుంది. చూద్దాం మరి రిలీజ్ తరువాత ఈసినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ లో రాబట్టుకుంటుందో.
కాగా 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలపై బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























