యువ హీరో సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్ లో నటించిన డీజే టిల్లు అనూహ్యవిజయాన్ని సాధించింది. ఈసినిమాలో సిద్దు యాక్టింగ్ యూత్ ను ఫిదా చేసింది.దాంతో డీజే టిల్లు బాక్సాఫీస్ ను షేక్ చేసింది.ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.టిల్లు స్క్వేర్ టైటిల్ తో వస్తున్న ఈసీక్వెల్ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుటుంది.ఇందులో సిద్దు సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండగా మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.డీజే టిల్లు ను విమల్ కృష్ణ డైరెక్ట్ చేయగా నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Our favourite DJ Tillu is gearing up for the biggest party in Theatres! 😎#TilluSquare ~ A Mad ride begins 15th Sept, 2023! 🕺🤩 #Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @SricharanPakala @NavinNooli #SaiPrakash @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas… pic.twitter.com/MPDFDjrccc
— Sithara Entertainments (@SitharaEnts) June 5, 2023
ఇక టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ ను కొద్దీ సేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు మేకర్స్.ఈసందర్భంగా మూవీ నుండి రొమాంటిక్ మోడ్ లో వున్న హీరో, హీరోయిన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.సెప్టెంబర్ 15న ఈసినిమా విడుదలకానుంది.అదే నెల 18న వినాయక చవితి కావడంతో సినిమా కు లాంగ్ వీకెండ్ కలిసి రానుంది.టిల్లు స్క్వేర్ కు రామ్ మిర్యాల,శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.సితార ఎంటర్టైన్మెంట్స్,శ్రీకరా స్టూడియోస్,ఫార్చ్యూన్ 4సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.మరి మచ్ అవైటెడ్ సీక్వెల్ గా వస్తున్న ఈసినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: