భోళా శంకర్ నుండి భోళా మేనియా సాంగ్ రిలీజ్

bhola mania lyrical song out from bhola shankar movie

మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది గాడ్ ఫాదర్ తో హిట్ ను కొట్టగా.. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక అదే జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా భోళా శంకర్. వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒకవైపు షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది చిత్రబృందం. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి బోళా మేనియా అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈపాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈపాటను రేవంత్ ఆలపించాడు. అదిరే స్టైలయ్యా, పగిలే స్వాగయ్యా, యుఫోరియా నా ఏరియా.. భోళా మేనియా అంటు మాస్ బీట్ తో ఈ పాట ఆకట్టుకుంటుంది. మెగాస్టార్ చిరంజీవి గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటలో చిరంజీవి స్టైలిష్‌గా, యంగ్‌గా కనిపిస్తున్నాడు.

కాగా ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు. ఈసినిమా ఆగష్ట్ 11 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =