ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి కూడా విదితమే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సంచలన విజయాన్ని అందించింది. ఈసినిమాతోనే పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చిన బన్నీ మొదటి ప్రయత్నంతోనే దేశవ్యాప్తంగా తన ఇంపాక్ట్ ను చూపించాడు. ఎంతోమంది ఫ్యాన్స్ ను సైతం దక్కించుకున్నాడు. ఇక మొదటిపార్ట్ సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టి పార్ట్ 2 పై పడింది. ఇక ఆదిశగానే షూటింగ్ కూడా జరుగుతుంది. సుకుమార్ సాలిడ్ కథనే తయారుచేశాడంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఫ్యాన్స్ ను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు బన్నీ. నేడు పర్యావరణ దినోత్సవం సందర్భంగా అల్లు అర్జున్ తన నివాసంలో ఒక మొక్కను నాాటాడు. ఇక తన ఫొటోను తన ఇన్ట్సా ద్వారా పోస్ట్ చేస్తూ తన అభిమానులకు కూడా మొక్కలు నాటమని తెలిపాడు.
View this post on Instagram
పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: